ఉన్నట్టుండి మోడీ పై పవన్ కళ్యాణ్ అభిమానులకి ప్రేమ!

Mahesh Kathi Tweets on Pawan Kalyanఒకవైపు జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ నేతృత్వంలోని సెంట్రల్ గవర్నమెంట్ ను విమర్శిస్తుంటే ఆయన అభిమానులకు మాత్రం మోడీ పై ప్రేమ పుట్టుకొచ్చింది అది ఎందుకు అనుకుంటున్నారా? బిగ్ బాస్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన సినిమా క్రిటిక్ మహేష్ కత్తి పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ADVERTISEMENT

గత కొంత కాలంగా ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పంటికింద రాయిలా తయారయ్యారు. పవన్ కళ్యాణ్ తాజా పర్యటన మీద, ఆయన చేస్తున్న ప్రసంగాల మీద కూడా విమర్శలు చేస్తున్నారు మహేష్ కత్తి. “మోడీ లాంటి నరహంతకుడితో చెట్టాపట్టాలేసుకుని ఎన్నికల ప్రచారం చేసిన నిన్ను, మతోన్మాద శక్తులతో చెయ్యి కలపకు అన్న శేఖర్ కమ్ముల చెడ్డోడు అయ్యాడా! ప్రధానమంత్రి అయినంత మాత్రమేనా మోడీ గుజరాత్ లో చేసింది రైట్ అయిపోతోందా? నీ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతూనే ఉంది పవన్ కళ్యాణ్,” అని మహేష్ కత్తి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

మోడీని నరహంతకుడు అన్నారని పవన్ కళ్యాణ్ అభిమానులంతా ట్విట్టర్ లో హైదరాబాద్ పోలీసుకు కంప్లయింట్ చేసి ఆయన మీద కేసు పెట్టేలా ప్రేరేపిస్తున్నారు. దేశ ప్రధానినే అంత మాట అంటారా అంటూ మోడీ పై ప్రేమ కురిపిస్తున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా వీరికి తోడుకోవడంతో పవన్ ఫాన్స్ తమ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories