బాలీవుడ్ జంట ‘సెటిల్మెంట్’ కోసం ప్రయత్నాలు!

malaika-arora-khan-divorce-demanded-rs-15-crబాలీవుడ్‌ నటుడు, నిర్మాత, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌, మలైకా అరోరా ఖాన్‌ దంపతులు విడిపోవ‌డానికి నిర్ణ‌యించుకొని న్యాయ‌స్థానం మెట్ల‌ను ఎక్కిన సంగ‌తి విదిత‌మే. వారి బంధం విడిపోకుండా ఉండ‌డానికి వారికి కౌన్సిలింగ్‌ను కూడా ఇచ్చారు. అయితే, వారు అంతిమంగా విడిపోవడానికే నిర్ణయించుకున్నారట. అర్బాజ్ ఖాన్ నుంచి మలైకా విడాకుల సెటిల్మెంట్‌ కోసం 10 కోట్ల నుంచి 15 కోట్లు మ‌ధ్య ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు బాలీవుడ్‌లో వార్త‌లు చక్క‌ర్లు కొడుతున్నాయి.

మలైకా డిమాండు పట్ల‌ అర్బాజ్‌ కూడా సానుకూలంగానే స్పందించాడ‌ట‌. వీరి కుమారుడు అర్హన్‌ ఖాన్‌ ప్రస్తుతం మలైకా దగ్గరే ఉంటున్నాడు. ఈ దంప‌తుల‌ను క‌ల‌ప‌డానికి వారి కుటుంబ సభ్యులు చేసిన ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌ల‌మ‌య్యాయి. త‌ను భార్య‌తో క‌లిసి జీవించ‌డానికి అర్బాజ్ ఒప్పుకున్నా, మలైకా మాత్రం ఒప్పుకోలేదని బాలీవుడ్ లో వార్త‌లు వ‌చ్చాయి. బాలీవుడ్ జంటలలో ‘డైవర్స్’ పరిణామాలు సర్వసాధారణంగా మారుతుండడంతో, ఇదే రకపు ప్రేరణ సౌత్ కు తాకిన వైనం ‘అమలాపాల్ అండ్ కో’ విషయాలలో చూస్తూనే ఉన్నాం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories