వైరల్ గా మారిన టాప్ సెలబ్రిటీ సెక్స్ వీడియో!

Malaysian badminton player Lee Chong Wei denies sex tape rumours-మూడుసార్లు ఒలిపింక్ రజత పతక విజేత, బ్యాడ్మింటన్ ప్రపంచ నంబరు-2 ఆటగాడు లీచాంగ్‌కు చెందిన సెక్స్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో షేర్లు అవుతున్న ఈ వీడియో సంచలనం సృష్టిస్తుండడంతో లీ చాంగ్ స్పందించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకు ఎవరో కావాలనే ఈ పని చేశారని ఆరోపించాడు.

ADVERTISEMENT

వీడియోలో ఉన్న వారిలో తాను కూడా ఒక్కడినని పేర్కొన్న లీ… దీనిని సర్క్యులేట్ చేయడం ఆపాలంటూ సోషల్ మీడియా యూజర్లకు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ద్వారా తనను అభాసుపాలు చేయాలనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోపై దర్యాప్తు చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. తన హక్కులకు భంగం కలిగితే సహించబోనని ఈ సందర్భంగా హెచ్చరించాడు.

ఈ వీడియో బయటకు రావడానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నట్టు వివరించాడు. ఈ మలేషియన్ ఆటగాడిపై వచ్చే నెలలో బయోపిక్ రానున్న నేపథ్యంలో ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా సంచలనమైంది. కాగా, లీపై గతంలో మ్యాచ్‌ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి. లీ సెక్స్ వీడియోపై బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ఇప్పటి వరకు స్పందించలేదు.

ADVERTISEMENT
Latest Stories