ట్రైలర్ టాక్ – ‘కామెడీ’ కోసం పడే ‘కుస్తీ పాట్లు’

mohan babu allari nareshఈ నెల 25వ తేదీన్ విడుదల కాబోతున్న “మామ మంచు అల్లుడు కంచు” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. మంచు మోహన్ బాబు, అల్లరి నరేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తాజాగా మరో ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మోహన్ బాబు నటించిన ‘అల్లరి మొగుడు’ చిత్రాన్ని, అల్లరి నరేశ్ నటించిన గత కామెడీ చిత్రాల సన్నివేశాలను కలిపి కొట్టినట్లుగా ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

ప్రేక్షకుల్లో నవ్వులు పండించడానికి నటీనటులు బాగా కష్టపడ్డారని అర్థమవుతోంది. సన్నివేశాల రూపకల్పనలో సహజత్వం కొరవడడంతో ఈ ట్రైలర్ కూడా అంతంత మాత్రపు ఆదరణకే పరిమితమవ్వొచ్చు. సక్సెస్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అల్లరి నరేష్, ఈ మల్టీస్టారర్ సినిమా తనను గట్టెక్కిస్తుందని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఆడియో సక్సెస్ మీట్ లో సినిమా విజయం పట్ల పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. అయితే మరి సినిమా ట్రైలర్స్ మాత్రం దానికి విరుద్దంగా ఉండడంతో… ఈ సారైనా అల్లరోడు సక్సెస్ ను అందుకుంటాడో లేదోనన్న సందేహం నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories