హీరోయిన్ కారుపై మూత్ర విసర్జన!

Man Urinated on Monal Gajjar Carఅల్లరి నరేష్ తో ‘సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ చిత్రాలు చేసిన హీరోయిన్ మోనాల్ గుల్జార్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. తన స్నేహితురాలితో కలిసి అంబావాడీ ప్రాంతంలో ఉన్న షాపింగ్ మాల్ కు వెళ్ళగా, కారును మాల్ ఎదుట పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళింది. తీరా షాపింగ్ ముగించుకుని కారు వద్దకు వస్తుండగా, ఓ వ్యక్తి తన కారు టైర్ పై మూత్ర విసర్జన చేస్తుండడం గమనించింది. ఈ క్రమంలో అతడిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

ADVERTISEMENT

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాల్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఓ దుకాణాన్ని సదరు వ్యక్తి నడుపుతుంటాడని పోలీసులు చెప్పుకొచ్చారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అడ్డా అయిన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజానికి ఇలాంటి సంఘటనలు ఇండియాలో చాలా సర్వసాధారణం అయినప్పటికీ, ఇక్కడ ఉన్నది సెలబ్రిటీ కావడంతో విషయం బయటకు వచ్చి, పోలీసులు కేసు నమోదు చేసే దాకా వెళ్ళింది.

ADVERTISEMENT
Latest Stories