వీడియో సాంగ్ – స్టన్నింగ్ విజువల్స్!

Manasuku Nachindi - Parichayamu Ledaa Song సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, ప్రిన్స్ మహేష్ బాబు సోదరి అయిన మంజుల దర్శకత్వం వహిస్తున్న “మనసుకు నచ్చింది” టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వీడియో సాంగ్ టీజర్ ను విడుదల చేసారు. ‘పరిచయం లేదా’ అంటూ సాగే ఈ పాటలో విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయని చెప్పవచ్చు.

మణిరత్నం సినిమాలలో పాటలు ఏ విధంగా ఉంటాయో, సరిగ్గా ఆ తరహాలో మంజుల ఈ పాటను తెరకెక్కించినట్లుగా కనపడుతోంది. ఇప్పటివరకు కమర్షియల్ సినిమాకు దర్శకత్వం వహించని మంజుల నుండి ఇలాంటి విజువల్స్ ఊహించలేం గనుక, చూసిన వారిని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తోంది ఈ పాట. దీని లిరికల్ వీడియోను సోమవారం క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories