మహేష్ బాబు సోదరి మంజుల దర్శకత్వంలో తెరకెక్కిన “మనసుకు నచ్చింది” ట్రైలర్ ను ప్రిన్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేస్తూ… చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ ట్రైలర్ ఎలా ఉందో కూడా క్లుప్తంగా వివరించారు కూడా! ఏమోషన్స్ తో కూడిన జాయ్ రైడ్ లాగా ఈ ట్రైలర్ ఉందని కితాబిచ్చిన ప్రిన్స్, చాలా ప్రామిసింగ్ గా ఉందంటూ మంజులకు అభినందనలు తెలిపాడు. నిజానికి ట్రైలర్ చూసిన తర్వాత సరిగ్గా ఇలాంటి అనుభూతులే ప్రేక్షకులకు కూడా కలుగుతాయి.
‘ఫాలో యువర్ హార్ట్’ అన్న థీమ్ ను ఎస్టాబ్లిష్ చేస్తూ ఓ ప్రేమకధను మంజుల “మనసుకు నచ్చింది” ద్వారా ప్రజెంట్ చేసినట్లు స్పష్టమవుతోంది. కధ పరంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ మాదిరి కనపడుతున్నా… టేకింగ్ అండ్ విజువల్స్ చూస్తే… మణిరత్నం సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఉన్నట్లు కనపడుతోంది. ఈ స్థాయిలో విజువల్స్ ను మంజుల చూపిస్తుందని ముందుగా అంచనా వేసింది కాదని స్పష్టంగా చెప్పొచ్చు. రవి యాదవ్ ఫోటోగ్రఫీ హైలైట్ గా సాగిన ఈ సినిమా ఈ నెల 26వ తేదీన విడుదల కానుంది.



