ఓకే అంటే నాగ్… నో అంటే సుమంత్..!

Common Girl Forces Manchu Lakshmi into War of Wordsవెబ్ సిరీస్ కి ఆదరణ పెరుగుతూ ఉండటంతో .. ఆ దిశగా దృష్టి పెట్టే వారి సంఖ్య కూడా పెరిగిపోతూ వస్తోంది. ఇప్పటికే కొంతమంది వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ ఉంటే .. మరొకొందరు వాటిలో నటిస్తున్నారు. తాజాగా ఓ వెబ్ సిరీస్ లో వెంకటేశ్, రానా నటించడానికి అంగీకరించారంటే, వెబ్ సిరీస్ లకి గల క్రేజ్ ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి కూడా ఒక వెబ్ సిరీస్ ను ప్లాన్ చేసిందని సమాచారం. 12 నుంచి 15 ఎపిసోడ్స్ వరకూ వుండే ఈ వెబ్ సిరీస్ కి అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో నాగార్జున చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, మంచు లక్ష్మి ఈ కాన్సెప్ట్ ను నాగార్జునకు చెప్పిందట.

ADVERTISEMENT

ఒక వైపున హీరోగా, మరో వైపున నిర్మాతగా బిజీగా వున్న నాగార్జున వెబ్ సిరీస్ లో చేస్తాడా? అనేదే ఆసక్తికరంగా మారింది. ఒకవేళ నాగార్జున చేయనని అంటే, సుమంత్ తో చేసే ఆలోచనలో మంచు లక్ష్మి ఉందనే టాక్ వినిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories