చిన్న సినిమాలు కూడా టెక్నికల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉంటున్నాయో ఇలాంటి సినిమాలను చూస్తే అర్ధమవుతుంది. 98 సెకన్ల పాటు సాగిన ఈ “మను” అనే సినిమా టీజర్ లో కనిపించింది కేవలం నాలుగంటే నాలుగుపాత్రలు. అయితేనేం నెక్స్ట్ సీన్ లో ఏం జరుగుతుంది? అన్న ఆసక్తిని ప్రతి సన్నివేశంలోనూ కలుగజేయడంలో దర్శకుడు సూపర్ సక్సెస్ అయ్యారు.
‘బ్యాక్ స్పేస్, మధురం’ అనే షార్ట్ ఫిలిమ్స్ కు దర్శకత్వం వహించిన ఫణింద్ర నర్సెట్టి స్వీయనిర్మాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మిస్టరీ రొమాన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు విశ్వనాధ్ రెడ్డి అందించిన ఫోటోగ్రఫీ హైలైట్ గా నిలువగా, నరేష్ కుమరన్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం మరో ప్లస్ పాయింట్. బ్రెత్ టేకింగ్ విజువల్స్ తో ‘వావ్’ అనిపించేలా ఉన్న ఈ సినిమాలో బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ ఒక కీలక పాత్ర పోషించాడు.
వీక్షకుల నుండి అద్భుతమైన స్పందనను తెచ్చుకుంటోన్న ‘మను’ టీజర్ మీ కోసం…



