మరో ముద్దుగుమ్మ పెళ్లి పెటాకులు కాబోతోందా?

meera-jasmine-divorce-rumorsసిల్వర్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలిగి, ఆ తర్వాత వివాహం చేసుకున్న హీరోయిన్ల జీవితాలన్నీ మళ్ళీ తారుమారవుతున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుండడం విశేషం. బాలీవుడ్ మలైకా అరోరా ఖాన్ నుండి దక్షిణాది అమలా పాల్ వరకు అనేక మంది సినీ ప్రముఖులు ఈ జాబితాలో వచ్చి చేరుతున్నారు. తాజాగా ఫ్యామిలీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ మీరా జాస్మిన్ వైవాహిక బంధం కూడా తెగిపోవడానికి రెడీగా ఉందని తెలుస్తోంది.

‘భద్ర, అమ్మాయి బాగుంది, యమగోల, అన్నవరం’ వంటి కొద్దిపాటి తెలుగు సినిమాలలో నటించిన మీరా జాస్మిన్… తమిళ, మలయాళం సినిమాల్లో మాత్రం ఎక్కువ పేరు తెచ్చుకుంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే రాజేష్ అనే మ్యుజీషియన్ తో ప్రేమాయణం సాగించడం, అప్పట్లో ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. అయితే, ఆ ప్రేమాయణం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆ తర్వాత అనిల్ జాన్ వ్యాపారవేత్తతో సత్సంబంధాలు పెట్టుకోవడం మరింత వేడిని రాజేసింది.

ADVERTISEMENT

అయితే అప్పటికే అనిల్ కు పెళ్లి కావడం.., మీరా జాస్మిన్ కోసం తన భార్యకు అనిల్ విడాకులు ఇవ్వడం.., ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లికి సిద్ధమవుతున్న సందర్భంలో… మీరాపై అనిల్ భార్య తరపు బంధువులు దాడి చేయడం… అనంతరం, పోలీసుల రక్షణలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. వీరి రెండేళ్ల పెళ్లి బంధానికి అప్పుడే బీటలు వారినట్లుగా… వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

గత ఏడాది కాలం నుంచే తన భర్తకు దూరంగా మీరా ఉంటోందట. విడాకుల కోసం వీరు త్వరలోనే కోర్టు మెట్లు ఎక్కనున్నట్టు తెలుస్తోంది. విడాకులు తీసుకున్న తర్వాత… సినిమాల్లో మళ్లీ బిజీ కావాలని మీరా జాస్మిన్ భావిస్తోందట. సాధారణ ప్రేక్షకులకు స్ఫూర్తి పొందే విధంగా ఉండాల్సిన సినీ సెలబ్రిటీల జీవితాలు, రోజురోజుకు కుచించుకుపోతుండడం గమనించదగ్గ విషయం.

ADVERTISEMENT
Latest Stories