మెగా ఫ్యామిలీ… ఒక్క హీరో ప్లీజ్..!

Chiranjeevi's Son-In-Law Kalyan Under Trainingమెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ‘మెగా’ వృక్షం పెరిగి పెరిగి ఎంత పెద్దదయ్యిందో అందరికీ తెలిసిందే. ముందుగా నాగబాబు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వంటి సోదరులతో పెరిగిన ‘మెగా’ కాంపౌండ్ లో ప్రస్తుతం 9 మంది హీరోలుగా ఉన్నారు. అతి త్వరలో మరో హీరో చిరు చిన్నల్లుడు కళ్యాణ్ రూపంలో మెగా అభిమానులను పలకరించబోతున్నాడు.

మెగాస్టార్ చిరంజీవితో మొదలుపెట్టి నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ వరకు ఎనిమిది మంది ఇప్పటికే ఇండస్ట్రీలో పాతుకుపోగా, హీరోయిన్ గా నిహారిక కూడా రాణిస్తోంది. అలాగే కళ్యాణ్ ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటుండగా, అతి త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతున్నాడు.

ADVERTISEMENT

ఇలా ఒక క్రికెట్ టీం తయారు కావడానికి ఒక్క హీరో దూరంలో ఉన్న మెగా ఫ్యామిలీ, ఆ ఒక్కటి కూడా పూర్తి చేస్తే… 11 మందితో కూడిన మెగా క్రికెట్ టీం ఏర్పాటు చేసుకోవచ్చని సోషల్ మీడియాలో వెలువడుతున్న కామెంట్స్ కు కొదవలేదు. ఇదేమి అసాధ్యం కాదు గానీ, మరి ఆ చివరాఖరి హీరో ఎక్కడ నుండి వస్తాడో చూడాలి

ADVERTISEMENT
Latest Stories