మెగాస్టార్ చిరంజీవి నటించిన 150 సినిమాలలో ఎన్నో మహోన్నతమైన పాత్రలను పోషించిన విషయం తెలిసిందే. మరి అలాంటి పాత్రలను మన చేతిలో పట్టుకుని ఆడేసుకుంటే ఎలా ఉంటుంది? అవును… మెగాస్టార్ పాత్రలతో ఒక అడ్వెంచరస్ వీడియో గేమ్ ను డిజైన్ చేసారు. ‘ఎం-యాప్ సోర్స్ డెవలప్మెంట్’ రూపొందించిన ఈ వీడియో గేమ్ ఈ నెల 9వ తేదీ నుండి ‘గూగుల్ ప్లే స్టోర్’లో అందుబాటులో ఉండనుంది.
అయితే ఈ గేమ్ ఎలా ఉండబోతుందో అన్న దానికి రూపంగా ఒక గేమ్ టీజర్ ను విడుదల చేసారు. మెగాస్టార్ 150 పాత్రలతో రూపొందించిన ఈ గేమ్ మెగా ఫ్యాన్స్ కు మరో పండగగా చెప్పుకోవచ్చు. విజువల్ ట్రీట్ గా కనపడుతోన్న ఈ గేమ్ 2 వాల్యూంస్ లో లభిస్తుందని సదరు సంస్థ స్పష్టం చేసింది. ఇంకేముంది… స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుని మెగాస్టార్ తో ఒక ఆట ఆడుకోవడమే ఫ్యాన్స్ వంతు..!
ADVERTISEMENT
ADVERTISEMENT



