మెగా ఫ్యామిలీ అంత ఖర్చు పెడుతుందా?

chiranjeevi vv vinayakమెగాస్టార్ 150వ సినిమాకు సంబంధించిన వర్క్ వేగంగా జరుగుతోంది. మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మించనున్న ఈ సినిమా ‘కత్తి’ రీమేక్ అని ఇప్పటికే ఓ క్లారిటీ రాగా, ప్రస్తుతం చిత్ర తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 75-100 కోట్లుగా అంచనా వేస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాయి. అయితే మెగా ఫ్యామిలీపై ఉన్న టాక్ రీత్యా, ఇంత పెద్ద మొత్తాన్ని ఒక్క చిరు సినిమాపై ఖర్చు పెడతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మెగాస్టార్ ఇమేజ్ ఏ మాత్రం చెక్కు చెదరినప్పటికీ, ఇటీవల ‘బ్రూస్ లీ’ చిత్రంలో చేసిన అతిథి పాత్రకు అంతంత మాత్రపు ఆదరణే రావడంతో, 150వ సినిమా నిర్మాణం వీలైనంత తక్కువ బడ్జెట్ లోనే పూర్తి చేయాలనుకున్నారట. అయితే రీమేక్ రైట్స్ నుండి లోకేషన్స్, అత్యున్నత సాంకేతిక నిపుణుల వరకు అన్నీ భారీ స్థాయిలోనే ఎంపిక జరుగుతుండడంతో బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువ అవుతోందని టాక్ ఊపందుకుంది.

బహుశా ఈ కారణంతోనే రామ్ చరణ్ కాకుండా మరో నిర్మాతను ఈ సినిమా మేకింగ్ లో భాగస్వామిని చేసినట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. నమ్మకంతో తీసుకున్నారో లేక సేఫ్ గేమ్ కోసమో గానీ మొత్తమ్మీద మెగాస్టార్ 150వ సినిమా బడ్జెట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories