చేపలు పట్టుకుంటున్న చిరంజీవి!

Chiranjeevi, Chiranjeevi Fishing Talent, Chiranjeevi Fishing Inside Details, Chiranjeevi Fishing Inside Story, Chiranjeevi Fishing Skills ప్రస్తుతం తన 150వ సినిమాపై దృష్టి సారించిన మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే తన 61వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మరి అలాంటి మెగాస్టార్ తాపీగా చేపలు పట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? అదేలేండి ‘క్లాస్’గా చెప్పాలి అంటే ‘ఫిషింగ్’ అంటారు… మన మెగాస్టార్ గారి ‘మాస్’ భాషలో అయితే ‘చేపలు పట్టుకోవడం’ అంటారు. అలాంటి ఫోజులనే ఇస్తూ దర్శనమిచ్చారు మెగాస్టార్.

ఏ పని చేసినా, ఎంతో శ్రద్ధగా చేసే చిరు, ఈ ఫిషింగ్ ను కూడా ఎంతో ఆసక్తిగా చేసారు. ఓ కుర్చీలో కూర్చుని నింపాదిగా ఫిషింగ్ చేసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అభిమానులను మెప్పించే లుక్ లో లేకపోయినప్పటికీ, మెగాస్టార్ పిక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తన ‘ఖైదీ నంబర్ 150’ షూటింగ్ రీత్యా ప్రస్తుతం గడ్డం పెంచుకుని ఉన్నారు ఈ సుప్రీం హీరో.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories