చిరు ఏంటి… ఇలా ఉన్నాడు..?

megastar-chiranjeevi-looks-at-age-60-years60 ఏళ్ళు పైబడిన మెగాస్టార్ చిరంజీవి ఏమైనా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? లేక మహేష్ బాబులా మారాలనుకుంటున్నారా? ‘ఖైదీ నంబర్ 150’కి సంబంధించిన లేటెస్ట్ ఫోటో చూస్తే ఇదే అనిపించకమానదు. క్రిస్మస్ సందర్భంగా శనివారం నాడు సాయంత్రం విడుదల కాబోతున్న ‘సుందరి’ అనే పాటలోని మరో స్టిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

రెండు చేతులు పైకి లేపి ఉన్న మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వ్యక్తిని పిలిచి, ఇతని వయసు ఎంతుంటుంది? అని ప్రశ్నిస్తే… ఖచ్చితంగా ఏ పవన్ వయసో, మహేష్ వయసో చెప్పడం ఖాయం అనిపించేటంతగా మెగాస్టార్ లుక్ ఉంది. బ్లాక్ జీన్స్, టీ షర్టు వేసి, స్టైలిష్ గాగుల్స్ పెట్టిన ఈ చిరంజీవి స్టిల్ సాధారణ ప్రేక్షకులకే అదిరిపోయేలా ఉండడంతో, ఈ పిక్ చూస్తూ మురిసిపోతుండడం మెగా ఫ్యాన్స్ వంతవుతోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories