త్వరలో “కత్తి” సినిమా రీమేక్ కు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుతం తన ఫిట్ నెస్ పై దృష్టి కేంద్రీకరించారు. డైలీ జిమ్ కు వెళ్తూ తన లుక్ ను మార్చే పనిలో ఉన్న మెగాస్టార్ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
సింపుల్ కాస్ట్యూమ్స్ తో అదరగొడుతున్న చిరు, మీసాలు మెలేసి అభిమానులకు పిచ్చేక్కిస్తున్నారు. మెగాస్టార్ లుక్ కు ఫిదా అయిన మెగా అభిమానులు “ఇంద్ర” సినిమాను తలుచుకుంటున్నారు. ‘ఇంద్ర’ సినిమాలో ఇదే తరహాలో మీసం మెలేసి అదిరిపోయే లుక్ లో మెగాస్టార్ కనపడ్డ విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టడంతో, ఈ “కత్తి” రీమేక్ కూడా బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తుందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరి ఇంతకీ ఇది “కత్తి” సినిమా కోసమేనా!?
ADVERTISEMENT





