‘మెగాస్టార్’ ఇచ్చే “గిఫ్ట్” అందుకోవాలంటే కష్టమే సుమీ!

megastar-chiranjeevi-offers-a-movie-with-surender-reddyమరో రెండు రోజుల్లో “ధృవ” సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్న దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతిభకు ముగ్ధుడైన మెగాస్టార్ చిరంజీవి ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. అయితే అది అలాంటి, ఇలాంటి ఆఫర్ కాదండోయ్… ఏకంగా తనను దర్శకత్వం వహించే అవకాశం..! “ఏదైనా మంచి కధ ఉంటే చూడు… కలిసి చేద్దాం…” అని ఓ ఓపెన్ ఆఫర్ ను చిరంజీవి తనకు ఇచ్చినట్లుగా దర్శకుడు సురేందర్ రెడ్డి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

నేడు (డిసెంబర్ 7వ తేదీన) పుట్టినరోజు జరుపుకుంటున్న సురేందర్ రెడ్డి, తన ‘ధృవ’ సినీ అనుభవాలను వెల్లడిస్తూ సదరు సంగతులను బయటపెట్టారు. దీంతో మెగాస్టార్ జాబితాలో మరో దర్శకుడు చేరారన్న విషయం ఖరారైంది. గతంలో పూరీ జగన్నాథ్, ఇటీవల బోయపాటి శ్రీనులకు కూడా ఇలాంటి బంపర్ ఆఫర్లు ఇచ్చారన్న ప్రచారం టాలీవుడ్ లో పెద్ద ఎత్తున జరిగిన విషయం తెలిసిందే. బహుశా తన తనయుడు కోసం రీమేక్ చేయడానికి ఒప్పుకున్నందు వలన సురేందర్ రెడ్డికి మెగాస్టార్ అందించిన బర్త్ డే కానుకేమో ఇది!

ADVERTISEMENT

అయితే ఈ “గిఫ్ట్”ను అందుకోవాలంటే మాత్రం చాలా కష్టమే సుమీ!

ADVERTISEMENT
Latest Stories