రసవత్తరమైన రాజకీయాలకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్ అనేది అందరికి తెలిసిన విషయమే, అయితే ఈ రసవత్తరానికి ఇంకొంచెం ఒత్తు తగిలించిన్నట్లు “అత్యంత రసవత్తరం” అన్నట్లుగా ఉండే రాజకీయం కొన్ని జిల్లాల్లో మాత్రమే కనబడుతుంది. అలాంటి జిల్లాల్లో నెల్లూరు జిల్లా ముందుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా సాగే రాజకీయం ఒకెత్తయితే, నెల్లూరుది మరో ఎత్తు. ఎవరు, ఎప్పుడు,ఎక్కడ, ఎలా సడన్ స్ట్రోక్ లు ఇస్తారోనని అర్ధంకానంతగా సాగుతుంది నెల్లూరు రాజకీయం.
నెల్లూరు రాజకీయాల్లో మేకపాటి కుంటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పట్ల జగన్ వ్యవవహరించిన తీరుకు ఆయన తీవ్రంగా హార్ట్ అయిన పరిస్ధితి. ఈ నేపధ్యంలోనే వచ్చే ఏన్నికల్లో తన సత్తా ఏంటో నిరూపంచుకోవాలని, తద్వారా జగన్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే బలమైన లక్ష్యంతో మేకపాటి ఉన్నారట.
దీంతో మేకపాటి నియోజకవర్గంలో పట్టు సాధించే పనిలో ఉన్నారట. ఇప్పటి నుండే అన్ని వర్గాల వారి నుండి మద్దత్తు కూడగట్టుకునే పనిలో పడ్డారట. అందుకోసం 30 సంవత్సరాల నుండి తన రాజకీయ ప్రత్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి తో భేటీ అయ్యారు మేకపాటి. సుమారు రెండు గంటల పాటు వీటి భేటీ జరిగింది. వీరిద్దరి భేటీతో నెల్లూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కినట్లు అయ్యింది.
నియోజకవర్గ అభివృద్ధి కోసం వారి భేటీ జరిగినట్లు మేకపాటి చెప్తున్నప్పటికి, అసలు విషయం మాత్రం ఈసారి టీడీపీ నుండి టికెట్ ఆశిస్తున్నట్లు, ఆ విషయంలో తనకు మద్దత్తుగా నిలవాలంటూ కంభం విజయరామిరెడ్డి ని మేకపాటి కోరినట్లు తెలుస్తుంది. మరో పక్క టీడీపీ ఉదయగిరి ఇంచార్జ్ గా బొల్లినేని రామారావు ఉన్నారు. త్వరలోనే బొల్లినేనితో కూడా మేకపాటి మంతనాలు జరిపబోతున్నట్లు తెలుస్తుంది.
ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి టీడీపీకి అనుకూలంగా ఓటువేశారు అనే ఆరోపణలతో వైసీపీ మేకపాటిని సస్పెండ్ చేసింది. అప్పటి నుండి మేకపాటి జగన్ పై ప్రతికారంతో రగిలిపోతున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈసారి టీడీపీ నుండి పోటీ చేసి విజయం సాధించి తద్వారా జగన్ కి సమాధానం చెప్పాలని మేకపాటి భావిస్తున్నారట.
మేకపాటి టీడీపీ లోకి వెళ్తే ఆపార్టీకి కూడా కలిసివచ్చే అంశంగానే రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. అదే ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, టీడీపీ ఇంచార్జ్ బొల్లినేని రామరావులు కూడా మద్దత్తు ప్రకటిస్తే మేకపాటి విజయం నల్లేరుమీద నడకే అన్న వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. వీరి ముగ్గురి కలయికతో 30 వేల పైచిలుకు మెజారిటీ కూడా వస్తుందనే అంచనాలు వేస్తున్నారు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు.
గత ఎన్నికల్లో నెల్లూరులో క్లిన్ స్వీప్ చేసిన వైసీపీ కి ఈసారి జరగబోయే ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం అనే వార్తలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపై వైసీపీ వేటు వేయడంతో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అంతకు అంత ప్రతీకారం తీర్చుకోవాలని ఆ ముగ్గురు నేతలు భావిస్తున్నారట. అదే జరిగితే నెల్లూరులో వైసీపీ 3 సీట్లు కోల్పోయినట్లే అనేది విశ్లేషకుల మాట.
ఏదిఏమైనా జగన్ ఇచ్చిన స్ట్రోక్ వల్లే 30 ఏళ్ళ రాజకీయ ప్రత్యర్ధులు ఒక్కటయ్యారంటూ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.



