కార్తీక్ సుబ్బరాజ్… గత కొన్ని రోజులుగా టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ హాట్ గా హల్చల్ చేసిన పేరు. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా ప్రారంభం కావడంతో సంచలనంగా మారిన కార్తీక్ సుబ్బరాజ్ నుండి లేటెస్ట్ గా విడుదల కాబోతున్న సినిమా “మెర్క్యూరీ.” ప్రభుదేవా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ ‘సైలెంట్ థ్రిల్లర్’ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ADVERTISEMENT
డైలాగ్స్ లేకుండా విడుదల చేసిన ఈ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, లొకేషన్స్ తో దర్శకుడు కట్టిపడేసాడు. ‘పిజ్జా’ వంటి థ్రిల్లర్ ను అందించిన కార్తీక్ సుబ్బరాజ్ మరోసారి తన మ్యాజిక్ ను రిపీట్ చేయబోతున్నాడనిటీజర్ స్పష్టం చేసింది. ‘ఎ నో లాంగ్వేజ్ ఫిల్మ్ – రిలిజింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్’ అంటూ స్పష్టం చేసిన ఈ సినిమాను ఏప్రిల్ 13వ తేదీన విడుదల చేయబోతున్నారు.
ADVERTISEMENT



