ట్రైలర్ టాక్ – క్రైమ్ కు కేరాఫ్ అడ్రస్!

Metro Trailer Talk‘చైన్ స్నాచింగ్’ చుట్టూ తిరిగే కధలతో తెలుగులో ఇప్పటికే ‘రొమాంటిక్ ప్రేమ కధ’ వంటి పలు చిన్న సినిమాలు విడుదలై, బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన విషయం తెలిసిందే. రొమాంటిక్ అండ్ క్రైమ్ నేపధ్యంలో సాగిన సదరు చిత్రాలకు తొలుత ఆదరణ బాగానే ఉన్నప్పటికీ, ఒకటికి మూడు, నాలుగు సినిమాలు విడుదల కావడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టించడంతో సినీ వర్గీయులు సక్సెస్ సాధించారు. అయితే కాస్త విరామం తర్వాత మళ్ళీ చైన్ స్నాచింగ్ కధతో ఓ సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.

“మెట్రో” పేరుతో మార్చి 3వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. చైన్ స్నాచింగ్ ను బేస్ చేసుకుని తెరకెక్కిన ఈ ట్రైలర్ ఆకట్టుకునే విధంగానే ఉన్నప్పటికీ, ఒక వర్గం ఆడియన్స్ కే పరిమితం అవుతుందని చెప్పవచ్చు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఈ ట్రైలర్ కు అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. అలాగే జోహన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా ట్రైలర్ ను ఆసక్తికరంగా మార్చింది. అయితే ఇటీవల కాలంలో డబ్బింగ్ బొమ్మలను తిరస్కరిస్తున్న నేపధ్యంలో “మెట్రో”కు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచిచూడాలి.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories