టిడిపి మహిళా నేత అనితా వంగలపూడికి ధైర్యం, దూకుడు రెండూ ఎక్కువే. అంతేకాదు.. ఆమె హ్యూమర్‌ను కూడా మెచ్చుకోవలసిందే. వైసీపీలో ప్రముఖ నేతల నోటితోనే తమ ప్రభుత్వ తీరు గురించి చెపుతున్నట్లుగా ఆమె పోస్ట్ చేస్తున్న వారి ఫోటోలు, వీడియోలే ఇందుకు నిదర్శనం.
మద్యపాన నిషేదం విషయంలో సిఎం జగన్మోహన్ రెడ్డి ఏవిదంగా మాట తప్పి మద్యం వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నారో తెలియజేసేందుకు, జగన్ అధికారంలోకి రాక మునుపు మద్యపానం గురించి మాట్లాడిన మాటల వీడియో క్లిప్పింగ్‌ను నిన్న ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి.
తాజాగా రాష్ట్రంలో నెలకొన్న దయనీయ పరిస్థితుల గురించి తెలియజేసేందుకు గతంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడిన మాటల తాలూకు ఓ వీడియో క్లిప్పును ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ‘రోజా చెప్పింది నేటికీ నిజమైంది,” అని చిన్న కామెంట్ వ్రాశారు.
ఈ మాటలను రోజా ఇదివరకు ఎప్పుడో చెప్పినప్పటికీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నట్లే ఉన్నాయి. ఆమె మాటలు వింటే పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా తమ జగనన్న ప్రభుత్వం గురించి ఈవిదంగా మాట్లాడుతున్నారేమిటా?అని అందరూ ఆశ్చర్యపోకమానరు.
వంగలపూడి అనిత తన నోటితో జగన్ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకుండా మంత్రి రోజా చేతే ఈ మాటలు అనిపించడం విశేషమే కదా? ఆమె హ్యూమర్‌ను మెచ్చుకోవలసిందే. ఇంతకీ రోజా ఏమి చెప్పారో మీరూ ఓసారి విని ఆనందించండి.
రోజా చెప్పింది నేటికి నిజమయ్యింది.#NakiliRatnalu pic.twitter.com/ESabUuntmM
— Anitha Vangalapudi (@Anitha_TDP) August 1, 2022



