పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇండైరెక్టు కామెంట్స్

mla-amarnath-ysrcpజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటల దాడి కొనసాగుతుంది. ఎమ్మెల్యే అమర్నాథ్‌ శనివారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో జనసేన అధినేతపై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషని, ఆయన చంద్రబాబు తొత్తు అని ఆయన విమర్శించారు.

“పవన్‌ కళ్యాణ్ రాజధానిలో పర్యటించి రైతుల పక్షాన ఉంటానని డబ్బాడు పెరుగున్నం తిన్నారు. పెరుగన్నం అరగక ముందే హైదరాబాద్‌ వెళ్లి మాట మార్చారు. పవన్‌ కళ్యాణ్ పూటకో మాట మాట్లాడుతున్నారు. ఊగడం మానేసి వాస్తవాలు తెలుసుకోవాలి” అని గుడివాడ అమర్నాథ్‌ ఎద్దేవా చేశారు.

ADVERTISEMENT

“పవన్ కళ్యాణ్ రాజధానిపై మాట్లాడేంత నిపుణుడు కాదు.. ఆయన ఎందులో ఎక్స్‌పర్టో అందిరికీ తెలుసు,” అని ఆయన ఇండైరెక్టుగా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో ఒక రాజధాని ఉంటే మరొక రాజధానిని అభివృద్ధి చేయకూడదా అంటూ ప్రభుత్వం తెర మీదకు తెచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనను ఆయన సమర్ధించారు.

“విశాఖలో రాజధానిని వ్యతిరేకించే టీడీపీ నాయకులు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారు. చంద్రబాబు మాటలు విని అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, అశోక్‌ గజపతి రాజు ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. అశోక్‌ గజపతి…రాజుగా కాకుండా బంటుగా వ్యవహరిస్తున్నారు,” అంటూ విమర్శలు చేశారు అమర్.

ADVERTISEMENT
Latest Stories