హీరోలకు డ్రగ్స్ టెస్ట్ – మరి రాజకీయ నేతలకు.?

Anirudh Reddy Comments

సమాజంలో ఆదర్శంగా ఉండే వ్యక్తులలో సినీ ఇండస్ట్రీ హీరోలు కూడా ఒకరు. అయితే వారుక్కరే సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని, వారొక్కరే తమ అభిమానుల ముందు సత్శీశీలులుగా కనిపించాలని జర్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి సమాజానికి చెప్పదలచుకున్నారా.?

తానూ చేసిన ఇప్పసారా వ్యాఖ్యలకు సమాజానికి సంజాయిషీ చెప్పుకోవాల్సిన సదరు ఎమ్మెల్యే ఇప్పుడు మీడియా ముందుకొచ్చి సినీ ఇండస్ట్రీ కి ఆ ఇండస్ట్రీ హీరోలకు హితబోధనలు చేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి హీరోలకు భారీ స్థాయిలో అభిమానులుంటారు.

ADVERTISEMENT

వారి అభిమాన హీరో సినిమాలో ఎలా కనిపిస్తే వారుకూడా అలా కనిపించాలని, తమ హీరో వెండితెర మీద ఏ స్టెపులేస్తే వారు కూడా అదే స్టెపులేస్తూ వారిని అనుకరిస్తారని, కాబట్టి సినీ ఇండస్ట్రీ హీరోలంతా డ్రగ్స్ విషయంలో ప్రజలలో ముఖ్యంగా యువతలో యవైర్నెస్ కల్పించాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారంటూ రెడ్డి గారు ఒక కథ మొదలుపెట్టారు.

అందులో భాగంగా ప్రతి హీరో కూడా తమ అభిమానుల కోసం ప్రతి 90 రోజులకొకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకుని ఆ రిపోర్టులను ప్రజల ముందు, తమ అభిమానుల ముందు పెట్టాలని, దానితో వారి హీరోల అభిమానులు మా హీరో డ్రగ్స్ జోలికి పోరని, తాము కూడా తమ అభిమాన హీరో మాదిరి డ్రగ్స్ కు దూరం అంటూ వాటి జోలికి పోకుండా ఉంటారంటూ ఒక అర్ధం పర్ధం లేని వాదన తెరమీదకు తెచ్చారు.

అసలు ఎక్కడ ఇప్పసారా వివాదం ఎక్కడ డ్రగ్స్ వాదన.? హీరోలు తమ అభిమానుల కోసం డాక్టర్ ల వద్ద డ్రగ్స్ టెస్ట్ అంటూ ప్రతి 90 రోజులకొకసారి శీల పరీక్షకు సిద్ధం కావాలంటూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సినీ నటులకు ఉచిత సలహాలిస్తున్నారు మరి రాజకీయ నాయకులు కూడా ప్రతి 90 రోజులకొకసారి తమ ప్రత్యర్థి పార్టీల నాయకుల ద్వారా వారి అవినీతికి కూడా శీల పరీక్ష చేయించుకుని ఆ రిపోర్ట్ ని తమ నియోజకవర్గ ప్రజల ముందు ఉంచగలరా.?

అయినా సినీరంగ ప్రముఖులు సమాజం కోసం, వారి అభిమానుల కోసం ఎన్నో సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ద్వారా లక్షలాదిమందికి ప్రాణం పోశారు, అలాగే బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా లక్షలాదిమంది క్యాన్సర్ బాధితులకు వైద్య సేవలు అందించారు.

ఇక పవన్ కళ్యాణ్ సంగతి అందరికి తెలిసిందే. రాజకీయాలలో కూడా తన సొంత డబ్బుతో సేవాకార్యక్రమాలు చేయడం, అన్నా అంటూ ఎవరైనా సాయం కోసం చేయిజాస్తే వారికీ ఆర్థిక సాయం అందించడం వంటి సేవాకార్యక్రమాలు నిత్యం వార్తలలో వినిపిస్తూనే ఉంటాయి.

మరి కాంగ్రెస్ పార్టీ నేత గా, జడ్చర్ల ఎమ్మెల్యేగా అనిరుథ్ రెడ్డి తన పార్టీ కార్యకర్తల కోసం ఇప్పటి వరకు ఏ సేవా కార్యక్రమాలు చేసారు, తన నియోజకవర్గ ప్రజల ప్రగతి కోసం ఎటువంటి అభివృద్ధి పనులు చేసారో చెప్పగలరా.? రాజకీయాలలో ఉంటూ ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి సమాజం పట్ల బాధ్యతగా ఉండక్కరలేదా.?

ఇప్పసారా, గుడుంబా అంటూ నోటికి వచ్చిన వ్యాఖ్యలు చెయ్యొచ్చా.? సినిమా యాక్టర్లందరూ తాము డ్రగ్స్ తీసుకోలేదు అని నిరూపించుకోవడం కోసం ప్రతి 90 రోజులకొకసారి నోటి మాట కాకుండా క్వాలిఫైడ్ టెస్ట్ చేయించుకోవాలి అంటున్న రెడ్డి గారు మరి రాజకీయ నాయకులు తమ పదవి అడ్డుపెట్టుకుని ఎటువంటి అవినీతి చేయలేదని నిరూపించుకోవడం కోసం ఎన్ని రోజులకొకసారి ఎటువంటి క్వాలిఫైడ్ టెస్ట్ చేయించుకోవాలో చెప్పగలరా.?

అసలు ఈ రెడ్డి గారి బాదంతా ఏపీలో ఆ రెడ్డి గారికి అధికారం దూరమయ్యిందనా.? ఆ దూరానికి పవన్ కీలక పాత్ర పోషించారనా.? అందుకే సినీ ఇండస్ట్రీలో ఇంతమంది నటీనటులన్నా ఈ రెడ్డి గారికి ఆ ముగ్గురే కనిపిస్తున్నారా.? అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా పవన్ టార్గెట్ గా అనిరుథ్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా.?

ADVERTISEMENT
Latest Stories