జగన్ ప్రభావం అంట… బికాంలో ఫిజిక్స్, లెక్కలు..!

mla-jaleel-khan-b-com-physics-mathematicsవైసీపీ నుండి టిడిపిలోకి జంప్ అయిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజ్ఞానవంతులకే తెలియని విజ్ఞానాన్ని వల్లించి అందరికీ షాక్ ఇచ్చారు. “తనకు చిన్నప్పటి నుండి లెక్కల్లో వందకు వంద మార్కులు వచ్చేవని, వాటి మీదున్న ఆసక్తితోనే తానూ బికాంను ఎంచుకున్నానని, ఇందులో లెక్కలు, ఫిజిక్స్ ఉంటాయని” చెప్పడంతో సదరు యాంకర్ కూడా అవాక్కైన పరిస్థితి నెలకొంది.

అయితే… తానూ కూడా బికాం విద్యార్ధినే అని, కానీ బికాంలో ఫిజిక్స్, లెక్కలు ఉండవని, ఉండేది కామర్స్ అని, అవి అకౌంట్స్ రూపంలో ఉంటాయని చెప్పారు. ఇంత చెప్పినప్పటికీ, జలీల్ ఖాన్ కామర్స్ అంటే లెక్కలే కదా… అయినా బికాంలో ఫిజిక్స్ లేకపోవడమేంటి… బికాంలో ఫిజిక్స్ ఉంటుందని మరోసారి చెప్పడంతో… పరిస్థితి అర్ధం చేసుకున్న యాంకర్ కాస్త సమయస్పూర్తిని వహించి, మీరు మరిచినట్లున్నారు, కాస్త సరిచూసుకోండి, బికాంలో ఫిజిక్స్ అస్సలు ఉండదు అంటే… ఏదో మరిచిపోయుంటాను అని తర్వాత ఒప్పుకున్నారు ఈ మాజీ వైసీపీ నేత.

ADVERTISEMENT

అయితే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న జలీల్ ఖాన్ తను చదువుకున్న చదువు గురించి కూడా మరిచిపోవడం అనేది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదంతా వైసీపీలో ఉండడం వల్లనే జరిగిందని, జలీల్ ఖాన్ ఈ విధంగా అయిపోవడానికి కారణం జగన్ ప్రభావమేనని ప్రత్యర్ధి పార్టీ వర్గాలు సెటైర్లు వేస్తుండగా, అంతే స్థాయిలో ఇతరుల నుండి కౌంటర్లు వస్తున్నాయి. ‘ఆహా… నా పెళ్ళంట…’ సినిమాలో కోడిని చూపించి కోడి కూర తినమంటే… కలెక్టర్ కావాల్సిన వ్యక్తి ఎలా అయిపోయాడో… జగన్ చెంత ఉండి వచ్చిన జలీల్ ఖాన్ కూడా అలాగే అయిపోయాడంటూ చలోక్తులు విసురుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories