నేను రాజకీయం మొదలుపెడితే మీకేం మిగలదు!

'MLA-Manchi-Lakshanaalunna-Abaayi'-Trailer-Talk--Surprisingly-Goodసినీ ప్రేక్షకులకు సంక్రాంతి మిగిల్చిన చేదు అనుభవాలతో సమ్మర్ బొనంజాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందులోనూ ఒక దానిని మించి మరొకటి అన్న రీతిలో వినూత్నమైన సినిమాలు విడుదల కానుండడంతో… సమ్మర్ హీట్ కు ఈ నెల 23 నుండి తెరలేపనుంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన “ఎమ్మెల్యే” సినిమా విడుదల కానున్న నేపధ్యంలో… ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ADVERTISEMENT

ఎంటర్టైనింగ్ టీజర్ ఆకట్టుకున్న ‘ఎమ్మెల్యే’ ట్రైలర్ ఫక్తు కమర్షియల్ ఫార్ములాతో నిండి ఉంది. విలన్ ను డీ కొట్టిన హీరో ఎమ్మెల్యేగా ఎలా అయ్యాడు అనేది సినిమా కాన్సెప్ట్ గా కనపడుతోంది. ప్రొడక్షన్ వాల్యూస్, మణిశర్మ సంగీతం, సాంకేతిక విభాగం ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ, కామెడీ విత్ పొలిటికల్ ఎప్పుడూ డేంజరే! అయితే దానిని సరిగ్గా డీల్ చేయగలిగితే మరో ‘పటాస్’లా పేలుతుంది, లేదంటే ‘ఇజం’లా తుస్సుమంటుంది.

ట్రైలర్ లో వదిలిన “ఎమ్మెల్యేగా గెలవడం అంటే సినిమాలో డైలాగ్స్ చెప్పడం, చిందులేయడం కాదు” అన్న విలన్ డైలాగ్స్ గానీ, “నేనింకా రాజకీయం చేయడం మొదలుపెట్టలేదు, మొదలుపెడితే… మీరు చేయడానికి ఏం మిగలదు” అన్న హీరో డైలాగ్స్ మాస్ ను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కానీ అవి సిల్వర్ స్క్రీన్ పైన ఎంతవరకు పేలతాయో చూడాలి. ఈ సినిమా ద్వారా ఉపేంద్ర మాధవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories