కేసీఆర్ కోరిక తీర్చిన మోడీ

modi goverment releases gazette on telangana zonesతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఇటీవలే చేసిన ఢిల్లీ యాత్ర ఫలించింది. తెలంగాణ నూతన జోనల్‌ విధానానికి కేంద్రం ఆమోదం తెలిపింది. 7 జోన్లు, 2 మల్టీ జోన్లకు అంగీకారం తెలుపుతూ కేంద్రం తాజాగా గెజిట్‌ విడుదల చేసింది. ఈ రోజు ఉదయం రాష్ట్రపతి సంతకం అనంతరం కేంద్ర హోంశాఖ వెంటనే గెజిట్‌ను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

[m9ad]

ADVERTISEMENT

దీనితో తెలంగాణలోని ఉద్యోగాలు అధికంగా స్థానికులకే దక్కబోతోంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రెండు జోన్ల స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పడతాయి. మొదటి నాలుగు జోన్లను ఒక బహుళజోన్‌గా, మిగిలిన మూడు జోన్లను రెండో బహుళజోన్‌గా పరిగణిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో శాసనసభను రద్దు చేసే ముందే కొత్త ఉద్యోగాల నియామకాలకు ఉత్తరువులు రాబోతున్నాయి.

ఎప్పటినుండో అపరిష్కృతంగా ఉన్న ఈ నూతన జోనల్‌ వ్యవస్థ తెరాస బీజేపీ మధ్య పొడుస్తున్న పొత్తుకు నిదర్శనమా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో తెరాస బీజేపీకి సహకరిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి తాము సహకరిస్తామని కేసీఆర్ వాగ్దానము చేసినట్టు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories