క్రికెటర్ అజారుద్దీన్ ఫేవరేట్ తెలుగు హీరో!

Mohammad Azharuddin favourite hero salman khanక్రీడా రంగంలో ఉన్న సెలబ్రిటీలకు సినీ స్టార్లు, సినీ రంగంలో ఉన్న సెలబ్రిటీలకు క్రీడాకారులు అభిమానులుగా ఉంటారన్న విషయం తెలిసిందే. అలాంటి క్రీడా సెలబ్రిటీలలో తెలుగు వాడైన టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తన తాజా ఇంటర్వ్యూలో తన అభిమాన తెలుగు హీరో ఎవరో అన్న విషయాన్ని బయటపెట్టారు. ఇండియాలో సల్మాన్ ఖాన్ తన అభిమాన హీరో అని, తెలుగులో మాత్రం మహేష్ బాబు సినిమాలు చూస్తానని స్పష్టం చేసాడు.

ADVERTISEMENT

దీంతో ప్రిన్స్ ఖాతాలో మరో సెలబ్రిటీ చేరిపోయాడు. ఒక్క తెలుగు క్రికెటర్లకే కాదు, తమిళనాడుకు చెందిన అశ్విన్ కూడా తన అభిమాన హీరో మహేష్ బాబే అని చెప్పిన విషయం తెలిసిందే. ఇలా క్రికెటర్లకు మాత్రమే కాదు, ప్రముఖ షటిల్, టెన్నిస్ క్రీడాకారులకు అభిమాన హీరో ప్రిన్స్ అన్న విషయాన్ని గతంలో చాలా సందర్భాలలో చెప్పారు. ఇండియా వ్యాప్తంగా తెలిసిన తెలుగు హీరో ఎవరూ అంటే మొదటగా వచ్చేది మహేష్ పేరే అన్నంతగా ప్రిన్స్ పేరు మారుమ్రోగుతుంటుంది.

ADVERTISEMENT
Latest Stories