సోదరుడితో శృంగారం చేయమనేవాడు – షమీ సతీమణి!

Mohammed Shami in extra-marital affairటీమిండియా బౌలర్ షమీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లుగా కనపడుతోంది. రోజుకో సంచలన ఆరోపణలతో మీడియాను హోరేత్తిస్తోన్న షమీ సతీమణి హసిన్ జహాన్ తాజాగా ఎవరూ ఊహించని ఓ ఆరోపణ చేసారు. తన సోదరుడితో శృంగారం చేయాల్సిందిగా షమీ నిత్యం ఒత్తిడి తెచ్చేవాడని, ఓ రోజయితే షమీ సోదరుడు హసీబ్ ఉన్న గదిలోకి తనను బలవంతంగా నెట్టి బయట గడి పెట్టేసాడని తీవ్ర ఆరోపణలు చేసింది.

ADVERTISEMENT

ఆ సమయంలో హసీబ్ కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో, తాను గట్టిగా అరిచానని దానికి భయపడిన షమీ తలుపులు తీసాడని చెప్పింది. ఇలాగే ఏదొక రకంగా షమీ కుటుంబ సభ్యులంతా తనపై నిత్యం దాడులకు పాల్పడేవారని చెప్తూ… షమీతో జరిపిన ఫోన్ రికార్డింగ్ ను మీడియాకు వినిపించింది. ఆ రికార్డింగ్ లో తనకు ఇతర మహిళలతో లైంగిక సంబంధాలు ఉన్నాయని స్వయంగా షమీనే పేర్కొనడం విశేషం.

ఇప్పటికే గృహహింస వంటి పలు కేసులు షమీపై నమోదు కాగా, పరిస్థితులు ‘అష్టదిగ్భంధనం’ అయ్యే విధంగా షమీకి మరింత గడ్డు రోజులు వచ్చే విధంగా రోజుకో అంశంతో హసిన్ జహాన్ మీడియా ముందుకు రావడం షమీని ఖచ్చితంగా కలవరపెట్టే అంశమే. ఇంత చేస్తున్న షమీ సతీమణి, చివరికి తనకు షమీనే కావాలి, నేను విడాకులు ఇవ్వను, ఆయనతోనే తన జీవితం అంటూ పేర్కొనడం ఈ కధలో ఉన్న అసలు ట్విస్ట్.

ADVERTISEMENT
Latest Stories