జగన్ “వై నాట్ 175 ” నినాదం…మీకు ఇలా అర్దమయ్యిందా..?

వచ్చే ఎన్నికలకు నేతలు ప్రజలలో తిరగడానికి జగన్ తన పార్టీ నేతలకు ఇచ్చిన నినాదం వై నాట్ 175 . 175 కి 175 మనమే ఎందుకు గెలవకూడదు..?అంటూ వైసీపీ పార్టీ నేతలకు ఒక పిలుపునిచ్చారు వైస్ జగన్ మోహన్ రెడ్డి. జగన్ చెప్పిందేంటో వైసీపీ శ్రేణులకు అర్ధమయ్యింది ఏంటో కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే జగన్ ఇచ్చిన నినాదంను వైసీపీ శ్రేణులు మరోలా వాడతన్నట్టున్నారు.

రేపల్లె నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న మోపిదేవి వెంకటరమణ కు వ్యతిరేకంగా నియమించిన డా.ఈవూరు గణేష్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు ఏకంగా” 159 “మంది తమ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేశారు. రేపల్లెకు చెందిన నాలుగు మండలాల వైసీపీ ఎంపీపీలు, జడ్పిటీసీలు, సర్పంచులు, కార్పొరేషన్ చైర్మన్లు అందరు మోపిదేవికి మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేసి అధిష్టానానికి రాజీనామా లేఖలు పంపారు.

ADVERTISEMENT

మోపిదేవి వెంకట రమణ కూడా వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన కూడా రాజీనామా బాట పట్టడానికి సిద్దమయ్యారంటూ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అలాగే పార్టీలో ఉంటారా లేదా అన్నటుగా ప్రవర్తిస్తున్న బాలినేని కూడా తొందరలోనే జగన్ కు ఝలక్ ఇవ్వనున్నారనే వార్త కూడా బాగా ప్రచారంలో ఉంది.

ఇలా రోజుకొకరుగా పార్టీ వీడుతున్న సీనియర్లకు మద్దతుగా వారి అనుచర ఘనం రాజీనామా బాట పట్టడంతో జగన్ ఇచ్చిన 175 ఇప్పటికే దరిచేరిందని, ఒకటి రెండు రోజులలో ఈ రాజీనామాల నెంబర్ కూడా 175 ని క్రాస్ అవ్వడం కాయం అంటున్నారు టీడీపీ శ్రేణులు. అలాగే నిన్న మంగళగిరిలో కూడా ఆర్కే రాజీనామా తో కలత చెందిన స్థానిక వైసీపీ నేతలు తమ తమ పదవులకు రాజీనామా చేసి పార్టీ పై తమ నిరసనను వ్యక్తం చేశారు.

జగన్ వై నాట్ 175 …మనమెందుకు గెలవలేం అనుకుంటే…పార్టీ శ్రేణులు మాత్రం వై నాట్ రాజీనామా..? మేమెందుకు పార్టీ లో ఉండాలి? ఎందుకు పార్టీకి రాజీనామా చెయ్యకూడదు? అంటూ జగన్ ను ప్రశ్నిస్తూ రాష్ట్రంలో వీస్తున్న నాలుగేళ్ళ ఫ్యాన్ గాలి తట్టుకోలేక ఎన్నికలకు నాలుగు నెలల ముందు రాజీనామాలతో దూసుకుపోతున్నారా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

ADVERTISEMENT
Latest Stories