సంగీత దర్శకుడిగా మణిశర్మకున్న క్రేజ్ తెలియనిది కాదు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మణి మ్యూజిక్ ఆశించినంత కిక్ ను ఇవ్వలేకపోతోంది. దీంతో నిరుత్సాహంలో ఉన్న మణిశర్మ సంగీత అభిమానులను అలరించేందుకు “ఎంఎల్ఏ” ఫస్ట్ సాంగ్ విడుదలైంది. ‘మోస్ట్ వాంటెడ్ అబ్బాయ్’ అంటూ విడుదల చేసిన ఈ పాట ఫుల్ జోష్ లో మణిశర్మలోని మునుపటి సంగీతాన్ని వినిపించింది.
‘ఆర్మానీ సూటు… అడిడాస్ బూటు… అదిరే నీ కటౌట్ మస్తుగున్నాదే…’ అంటూ ప్రారంభమైన ఈ పాటలోని సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి అందించారు. మాస్ ప్రియులను అలరించే విధంగా ఉన్న లిరిక్స్ కు మణిశర్మ మాంచి ఊపున్న సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా ‘మోస్ట్ వాంటెడ్ అబ్బాయ్’ అనే క్యాచీ లిరిక్స్ లో మణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మణి మార్క్ ను మ్యూజిక్ వినసొంపుగా ఉంది.
రెగ్యులర్ కమర్షియల్ మాస్ మ్యూజిక్ అయినప్పటికీ, మణి సంగీతాన్ని అమితంగా ఇష్టపడే వారికి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఈ పాట ఎక్కేస్తుంది. యాజిన్ నిజార్, రమ్య బెహారలు ఆలపించిన ఈ పాట విజువల్ గా కాజల్ అభిమానులకు పండగ లాంటిదని లిరిక్స్ స్పష్టం చేస్తున్నాయి. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 23వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.



