ఎన్నో భారీ అంచనాలతో విడుదలైన మొదటి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైన తర్వాత, మూడవ ప్రయత్నంగా వస్తోన్న అక్కినేని అఖిల్ “మిస్టర్ మజ్ను” ఫస్ట్ లుక్ వచ్చేసింది. 49 సెకన్ల నిడివి గల ఈ టీజర్ లో అఖిల్ ఫ్రెష్ లుక్ తో ఆకట్టుకునే విధంగా ఉన్నాడు. అలాగే డైలాగ్ డిక్షన్ లో కూడా ఆత్మవిశ్వాసం వినిపించింది.
[m9ad]
అఖిల్ తర్వాత ఈ టీజర్ లో మేజర్ హైలైట్ అయ్యింది ఎస్.ఎస్.థమన్ సంగీతం. బ్యాక్ గ్రౌండ్ లో థమన్ ఇచ్చిన పాట అదిరిపోయే రేంజ్ లో ఉంది. ముఖ్యంగా ‘దేవదాసుకు మనవడు, మన్మధుడుకు వారసుడు’ వంటి పదాలతో అక్కినేని అభిమానులకు వీనులవిందుగా ఉంటుంది. ‘మిస్టర్ మజ్ను’ అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వస్తూ అఖిల్ కళ్ళజోడు సరిచేసుకునే షాట్ ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్.
ఏఎన్నార్ పుట్టినరోజు కానుకగా ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ “మిస్టర్ మజ్ను”కు మంచి మార్కులు పడగా, నాగ్ ‘దేవదాస్’ ధియేటిరికల్ ట్రైలర్ మరియు చైతూ ‘సవ్యసాచి’ టీజర్ లు కూడా అభిమానులను పలకరించనున్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న ‘మిస్టర్ మజ్ను’కు బివిఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.



