షాకింగ్ : ట్రేడ్ వర్గాలను అవాక్కు చేసిన ధోని సినిమా!

m-s-dhoniటీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా “ఎంఎస్ ధోని – ది అన్ టోల్డ్ స్టోరీ” శుక్రవారం నాడు భారీ స్థాయిలో విడుదలై, ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలను తెచ్చుకుంది. సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉందని, ధోని కెరీర్ లో కీలకమైన ఐపీఎల్ ను అసలు చూపించకపోవడం వంటి అంశాలు ప్రేక్షకులను నిరాశ పరిచినప్పటికీ, ధోని అభిమానులను మాత్రం ఈ సినిమా అలరించడంలో సక్సెస్ అయ్యింది.

ADVERTISEMENT

అయితే, ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ మాత్రం ట్రేడ్ వర్గాలను షాకింగ్ గురి చేస్తున్నాయనే టాక్ హల్చల్ చేస్తోంది. ఈ ఏడాది కింగ్ ఖాన్ షారుక్ నటించిన “ఫ్యాన్” చిత్రం సాధించిన ఓపెనింగ్స్ ను ‘ధోని’ సినిమా దాటేసిందన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది. షారుక్ సినిమా తొలిరోజు దాదాపుగా 19 కోట్లు కొల్లగొట్టింది. అంటే ధోని బయోపిక్ అంతకుమించి వసూళ్లు సాధించిందంటే… అది టీమిండియా కెప్టెన్ ధోని ప్రభావమేనని చెప్పాలి.

షారుక్ ను మించిపోయే రేంజ్ లో ధోని ప్రభావం చూపాడంటే సాధారణ విషయం కాదన్నది ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం. బ్యాట్ పట్టుకుని మైదానంలోకి అడుగుపెడితే ధోని గొప్పతనం ఎలా కనపడుతుందో, సిల్వర్ స్క్రీన్ పై కింగ్ ఖాన్ షారుక్ కూడా అలాంటి రారాజే. మరి అంతటి షారుక్ సినిమా రికార్డులు బద్దలు కొట్టడమంటే సాధారణ విషయం కాదు కదా! 2016 సంవత్సరానికి గానూ టాప్ 3 ఓపెనింగ్స్ లో ఒకటిగా ‘ధోని’ సినిమా నిలిచిందని ట్రేడ్ వర్గాల టాక్. ఇదే ఊపు కొనసాగితే… ధోని అందుకోవడం బాలీవుడ్ హీరోల తరమా..?!

ADVERTISEMENT
Latest Stories