అందరి కళ్ళు ధోని వైపే… పదేళ్ళ తర్వాత ఫస్ట్ మ్యాచ్..!

MS Dhoni Virat Kohli one day matchకెప్టెన్సీకి రాజీనామా చేసిన తర్వాత మహేంద్ర సింగ్ ధోని ఆడుతున్న మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ కావడంతో, అందరి చూపులు ధోని పైనే ఉన్నాయి. ఇండియా – ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రారంభం కానున్న వన్డే సిరీస్ లో భాగంగా, పుణెలో మొదటి మ్యాచ్ ఇందుకు వేదిక అయ్యింది. దాదాపు పదేళ్ల తరువాత మరో కెప్టెన్ నాయకత్వంలో మహేంద్ర సింగ్ ధోనీ ఆడుతున్న మొదటి మ్యాచ్ కావడంతో, మ్యాచ్ కు సెంట్రాఫ్ అట్రాక్షన్ కానున్నాడు.

ఇదే సమయంలో టెస్టు జట్టుకు విజయవంతమైన కెప్టెన్ గా నిరూపించుకున్న విరాట్ కోహ్లీ, అన్ని ఫార్మాట్ జట్ల బాధ్యతలనూ స్వీకరించి, పూర్తి స్థాయి కెప్టెన్ గా ఆడనున్న తొలి మ్యాచ్ కూడా ఇదే. దీంతో ఈ మ్యాచ్ భారత జట్టుకు కీలకం కాగా, టెస్టు సిరీస్ ను ఓడిపోయిన ఇంగ్లండ్ జట్టు పగ తీర్చుకోవాలని భావిస్తోంది. నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను ఇంగ్లాండ్ 3-0తో కోల్పోయిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

జేసన్ రాయ్, హేల్స్, బట్లర్ వంటి హిట్టర్లతో నిండిన ఇంగ్లండ్ ను తక్కువగా అంచనా వేసేది లేదని కోహ్లీ ఇప్పటికే స్పష్టం చేశాడు. భారత జట్టులోకి పునరాగమన అవకాశాన్ని దక్కించుకున్న యువరాజ్ సింగ్ ఆట పైన కూడా అందరి దృష్టీ ఉంది. ఈ మ్యాచ్ కోసం కేటాయించిన టికెట్లన్నీ అమ్ముడు కాగా, అభిమానుల కేరింతలతో స్టేడియం దద్దరిల్లడం ఖాయం.

ADVERTISEMENT
Latest Stories