ఎన్నికల ముందు ఎన్నికల తరువాత వైసీపీ పార్టీని వీడిన వారు జగన్ నాయకత్వాన్ని తప్పుబట్టిన వాళ్ళు అందరూ కలిసి జగన్ మీద చేసిన మూకుమ్మడి విమర్శ జగన్ తన పార్టీ తరుపున గెలిచిన ఎమ్మెల్యే లను కూడా కలవడు. పార్టీ కార్యకర్తలను పట్టించుకోడు.
కనీసం మంత్రులకు కూడా జగన్ తన సమాయన్ని కేటాయించడు అనే వాదన వైసీపీ మద్దతుదారుల నుండి ఆ పార్టీ నాయకుల వరకు అందరూ ముక్త కంఠంతో నొక్కి వక్కాణించారు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పార్టీలో ఏ స్థాయి నాయకుడైన తాడేపల్లి పాలస్ లో జగన్ దర్శనం చేసుకోవాలి అంటే ఆ పాలస్ గేటు ముందు ఆయన అనుమతి వచ్చే వరకు చేతులు కట్టుకుని వేచి చూడాల్సిందే.
తమ నియోజకవర్గం సమస్యలు విన్నవించుకోవడానికైనా, తమ మంత్రిత్వ శాఖల మీద అనుసరించ వలసిన వ్యూహాలను తెలుసుకోవడానికైనా తాడేపల్లి పాలస్ తలుపు తడితే తీయడానికి ఎంత సమయం పడుతుందో సొంత పార్టీ నేతలకే తెలియని పరిస్థితి. అధికారంలో ఉన్నన్నాళ్ళు తన ఎమ్మెల్యే లని పిలిపించి స్థానిక పరిస్థితుల మీద అవగాహన చేసుకోకుండా, భవిష్యత్ కార్యాచరణ పై చర్చలు జరపకుండా ఒక నియంతలా తాను చెప్పిందే శాసనం అన్నట్టు ప్రవర్తించారు.
దాని ఫలితం 2024 ఎన్నికలలో మొత్తం వైసీపీ నాయకులు అనుభవిస్తున్నారు. క్షవరం అయితే కానీ జగన్ కు వివరం రాలేదా.? అన్నటుగా 151 సీట్ల నుండి 11 సీట్లకు వస్తే కానీ జగన్ కు తన సొంత పార్టీ నాయకులకు కూడా కాస్త సమయం ఇవ్వాలి అనే విషయం బోధపడలేదు. గతంలో వారాలపాటు ఎదురు చుస్తే కానీ దక్కని జగన్ అపాయింట్ మెంట్ ఇప్పుడు అనుకుంటే అయిపోతుంది అనేలా మారిపోయింది.
జగన్ ఓడిపోయిన తరువాత తమ పార్టీ నాయకులను తన తాడేపల్లి రాజమందిరానికి పిలిపించుకుని రానున్న కాలంలో పార్టీని ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలి అనే దాని పై చర్చలు జరుపుతున్నారు. పార్టీ తరుపున ఓడిపోయిన నాయకులను పిలిపించి వారు పార్టీ వీడకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
గత ప్రభుత్వం లో వైసీపీ నేతలు చేసిన పాపాలకు నేటి ప్రభుత్వంలో శిక్షలు పడుతున్న ఈ తరుణంలో జగన్ కు ఒక్కసారిగా పార్టీ నాయకులు గుర్తొచ్చారు. ఈ రోజు తాడేపల్లి క్యాంపు ఆఫీసులో వైసీపీ ముఖ్యనేతలతో జగన్ సమావేశమయ్యారు. ఇందులో ముద్రగడ పద్మనాభ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రస్తుత రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది.? వైసీపీ నాయకుల అరెస్టుల విషయంలో ప్రజాభిప్రాయం పైన చర్చలు జరిగినట్టు సమాచారం.
ఇదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎదుటి వారి అభిప్రాయాన్ని గౌరవించిన, కనీసం విన్నా ఇప్పుడు మంచి చేస్తే ఎందుకు ఓడిపోయాను అంటూ ఎదురు ప్రశ్న వేసే దుస్థితి జగన్ కు వచ్చేది కాదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆవేదన అర్ధం చేసుకోలేదు, ప్రతిపక్షాల పోరాటాలను అవగాహన చేసుకోలేదు, సొంత పార్టీ నాయకుల ఆలోచనలను గౌరవించలేదు.






