mudragada-padmanabham

ఏపీ శాసనసభ ఎన్నికలు ఎందరికో అనేక గుణపాఠాలు నేర్పి ఉంటాయి. ఎందరికో కనువిప్పి కల్పించి ఉంటాయి. మరెందరినో సన్యాసం తీసుకునేలా చేస్తున్నాయి. జగన్‌ పోకడలు, ఆలోచనలు, నిర్ణయాలు, విధానాలు సరికావని యావత్ దేశానికి తెలియజేశాయి. ప్రజలను లైట్ తీసుకుంటే ఏమవుతుందో స్పష్టం చేశాయి. ప్రభుత్వాలను ప్రజలు కాదు మావంటివారే మార్చగలరనే అహంభావంతో విర్రవీగే వారికి కనువిప్పు కలిగించేలా చేశాయి.

అటువంటి వారిలో పెద్దాయన ముద్రగడ పద్మనాభం కూడా ఒకరు కావడం చాలా బాధాకరమే. ఆయన పవన్‌ కళ్యాణ్‌తో విభేధించడానికి, వైసీపిలో చేరడానికి బలమైన కారణం ఏదీ కనిపించలేదు. కానీ ఆ నిర్ణయం తప్పని దాని వలన తానే నష్టపోయానని, నవ్వులపాలయ్యానని ఈపాటికి గ్రహించే ఉంటారు.

Also Read – వైసీపీ కి ఆ అర్హత ఉందా.? కానీ జనసేన బాధ్యత..!

జగన్‌ ప్రోత్సాహంతో ముద్రగడ పద్మనాభం ఎన్నికల సమయంలో పవన్‌ కళ్యాణ్‌ని ఉద్దేశ్యించి చాలా అనుచితంగా మాట్లాడారు. అంతటితో ఊరుకోకుండా తాను కనుసైగ చేస్తే చాలు… రాష్ట్రంలో కాపు సామాజికవర్గం మొత్తం తాను సూచించినవారికే ఓట్లు వేసి గెలిపించేస్తుందనే భ్రమలో ఉండేవారు.

బహుశః ఆ గుడ్డి నమ్మకంతోనే పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ని ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని శపధం చేసేశారు. పవన్‌ కళ్యాణ్‌ భారీ మెజార్టీతో గెలిచి, ఉప ముఖ్యమంత్రి పదవితో సహా కీలక శాఖల బాధ్యతలు కూడా చేపట్టారు. ఇది కాపు సామాజిక వర్గానికి గర్వ కారణమే కదా?

Also Read – జనసేన ‘చిరు’దరహాసం…!

కనుక ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకుంటానని శపధం చేసినందున మార్చుకోక తప్పలేదు. చట్ట ప్రకారం పేరు మార్పుకి ఆయన ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కనుక కాపుగా వద్దనుకొని రెడ్డిగా మారిపోయారు కనుక ఇప్పుడు ఆయన ఏ కులానికి చెందుతారో… దేనితో మమేకం అవుతారో ఆయనే నిర్ణయించుకోవాలి. ఆయనను ఏ కులంవారు తమలో కలుపుకుంటారో చూడాలి.

రాష్ట్రంలో కాపులకు అధికారంలో భాగస్వామ్యం లభించబోతున్న సమయంలో ఆయన పవన్‌ కళ్యాణ్‌కు అండగా నిలబడి ఉండి ఉంటే ఆయనకు ఎంతో గౌరవ మర్యాదలు లభిస్తుండేవి. పదవులు చేపట్టకపోయినా ఆయన కాపులకు తనవంతు మేలు చేశారనే మంచి పేరు వచ్చేది. రాజకీయాలలో తన చివరి అధ్యాయం చాలా హుందాగా, గౌరవంగా ముగించగలిగి ఉండేవారు. కానీ చేజేతులా తన ‘పేరు’ తానే పాడుచేసుకొని అవమానకరంగా తప్పుకోవలసివస్తోంది. ఆ స్థాయి నాయకుడికి ఇటువంటి ముగింపు బాధాకరమే. కానీ చెడు సావాసానికి ఆనాడు కురు వృద్ధులు కూడా మూల్యం చెల్లించక తప్పలేదు కదా?

Also Read – జీఎస్టీ ఆదాయం తగ్గితే.. సిగ్గు పడాల్సింది బాబు కాదు.. జగనే!


mudragada-padmanabham-name-change