అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని పోలేదంట..!

Mumbai Indians Form

ఐపీఎల్ 2026 సీజన్ మొదలయి ఇప్పటికే 3 వారాలు పూర్తవగా, దాదాపు జట్లన్నీ తమ అభిమానులు ఆశించిన స్థాయిలోనే ప్రదర్శించాయి. చెన్నై జట్టు మొదటిలో అనుకున్న స్థాయిలో రాణించలేకున్నప్పటికీ, ఇటీవలే వారు 2 కు 2 మ్యాచ్లను నెగ్గి, ఫామ్ అందుకున్నారు.

కానీ, ప్రస్తుతం ఒక జట్టు ఫామ్ మాత్రం కేవలం తమ అభిమానులనే కాదు, యావత్ ఐపీఎల్ అభిమానులను షాక్ కు గురిచేస్తుంది. సీజన్ మొదలవకముందునుండే ఈసారి కప్పు తమదే అంటూ చెప్పిన అభిమానులు, నేడు ఆ జట్టు ఫామ్ చూసి కలవరపడక తప్పట్లేదు.

ADVERTISEMENT

ఆ జట్టు మరేదో కాదు, 5-టైం చాంపియన్ ‘ముంబై ఇండియన్స్’. పేరుకు తగ్గట్టే భీకరమైన భారత ఆటగాళ్లతో పాటు ఈ ఆటలో ఎప్పటినుండో ఆరితేరిన నిష్ణాతులు ఆ జట్టులో సభ్యులై ఉన్నారు. రోహిత్ శర్మ, సూర్య కుమార్, హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ వంటి అంతర్జాతీయ క్రికెట్లో ఆరితేరిన ఇండియన్స్ వీరికి సొంతం.

పోనీ ఫారెన్ ప్లేయర్స్ ఏమైనా తక్కువయ్యారా అంటే.. ఐపీఎల్ లో ను మరియు అంతర్జాతీయ క్రికెట్ లో ఆరితేరిన ఆఫ్రికన్ వికెట్-కీపర్, బ్యాటెర్ డి-కాక్ మరియు రికెల్టన్, న్యూజిలాండ్ కు చెందిన బోల్ట్ మరియు ప్రస్తుతం ఆ దేశపు కెప్టెన్ మిచెల్ సాన్ట్నర్, విండీస్ కు చెందిన రూథర్ఫర్డ్, ఇంగ్లాండ్ ఆల్-రౌండర్ జాక్స్ ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి ఒక్క ఆటగాడు క్రికెట్ లో నిష్ణాతుడే.

కానీ, ఎం చేస్తాం.. ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లు, భీకరమైన బ్యాటర్లు, లెజెండరీ బౌలర్లు, అద్భుతమైన ఆల్-రౌండర్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం ముంబై జట్టు తడపడకతప్పట్లేదు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్లలో కేవలం 1 మ్యాచ్లో గెలిచి, పాయింట్ల పట్టికలో 2 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది ఈ జట్టు.

ఈ సీజన్ మొదలవకమునుపు, ప్రతి క్రికెట్ దిగ్గజం ముంబై ఇండియన్స్ జట్టును హాట్-ఫెవరెట్స్ అని వ్యాఖ్యానించిన వారే. అంత సాలిడ్ టీం ఉండికూడా ముంబై జట్టు అనుకున్న స్థాయిలో రాణించలేకపోతుంది. ఇందుకు, కొందరేమో బౌలింగ్ తప్పుల వల్లే మ్యాచ్లు ఓడిపోతున్నాం అనగా, కొందరు బ్యాటర్లను నిందిస్తున్నారు.

బ్యాటింగ్లో రోహిత్ మరియు రికెల్టన్ మొదటి మ్యాచ్లో ఫైర్ అయినప్పటికీ, మిగతా 3 మ్యాచ్లు ఈ ఓపెనింగ్ జోడి మంచి ఆరంభాలు ఇవ్వడంలో తడపడుతూనేవచ్చారు. ఇప్పటికీ తిలక్ కు ఈ సీజన్లో కనీసం ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా లేకుండటం ఆశ్చర్యం.

మిడిల్ ఆర్డర్లో సూర్య, పాండ్య, నమన్ వంటి వారు నిలకడగా ఆడలేకపోతున్నారు. మరోపక్క బౌలింగ్లో బుమ్రా ఖాతాలో వికెట్ పడి ఇప్పటికే 5 మ్యాచ్లు అయ్యాయి. తన ఐపీఎల్ కెరీర్లో మునుపెన్నడూ వరుసగా 5 మ్యాచ్లలో బుమ్రాకు వికెట్ దక్కకుండా లేదు.

ఇలా, కేవలం బ్యాటింగ్ లేదా బౌలింగ్ లో విఫలమయ్యి ముంబై మ్యాచ్ కోల్పోతున్నారు అనేది వాస్తవం కాదు. జట్టు లో ని సభ్యులందరి నుండి సమిస్తి కృషి వచ్చిన రోజు ముంబై కు గెలుపు సులువవుతుంది. ప్రస్తుతం, ఆడిన ప్రతి మ్యాచ్లో గెలిచిన పంజాబ్ తో నేడు ముంబై తలపడనుంది.

ఆడిన 4 మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ కుడా ఓడిపోకుండా, ప్రస్తుతం ఐపీఎల్-26 లో ఓటమి ఎరుగని జట్టుగా ఉన్నారు పంజాబ్. చూడాలి మరి ముంబై జట్టు తమ ఒత్తిడులను అధిగమించి డేంజరస్ పంజాబ్ ను కూలగొట్టి తిరిగి విజయ బాటలోకి రాగలరా అని..?

ADVERTISEMENT
Latest Stories