మహేష్ సినిమా అప్ డేట్స్ ఇచ్చిన మురుగదాస్!

Murugadoss Mahesh Babu Movie, Murugadoss Mahesh Babu Movie Release, Murugadoss Mahesh Babu Movie Release Date, Murugadoss Mahesh Babu Movie Updatesమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న సినిమాకు సంబంధించి ఓ కీలక వార్త బయటకు వచ్చింది. ‘అఖిరా’ సినిమా సక్సెస్ లో ఉన్న మురుగదాస్, తన తదుపరి ప్రాజెక్ట్ అయిన మహేష్ సినిమా గురించి మీడియాకు సమాచారం ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ సినిమా విడుదల సమయాన్ని ప్రకటించారు. 2017 ఏప్రిల్ లో ఈ సినిమా విడుదలను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిపారు మురుగదాస్.

యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ప్రకటించిన మురుగదాస్, మరిన్ని వివరాలు ఇప్ప్పుడే చెప్పడం సమంజసం కాదని, ఒక్కసారి సినిమా పూర్తయిన తర్వాత చెప్తానని అన్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ మరియు మరికొన్ని కార్పొరేట్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

ADVERTISEMENT

మురుగదాస్ చెప్పిన వివరాల ప్రకారం వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదల ఉంటుందని చెప్పవచ్చు. ఏప్రిల్ చివరలో ‘బాహుబలి 2’ విడుదల ఉండడంతో, ఆ సినిమాకు ముందుగానే విడుదల అవుతుందా? లేక ‘శ్రీమంతుడు’ మాదిరి వెనక్కి తగ్గి, మళ్ళీ బ్లాక్ బస్టర్ అందుకుంటాడా? అనేది వేచిచూడాలి. డిసెంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తయితే, జనవరి నుండి ప్రిన్స్ కొత్త సినిమాను ప్రారంభిస్తారా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT
Latest Stories