11వ తేదీన చిరంజీవి కోసం సెలవు ప్రకటించారు!

Muscat Construction Company declares Holiday for Khaidi No 150 releaseవెండితెరపై తమ అభిమాన హీరోను ఎప్పుడెప్పుడు చూసుకుందామా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరో రెండు రోజుల్లో వారి కల సాకారం కానుండడంతో ఈ ఘడియలు కోసం ఉత్కంఠగా నిరీక్షిస్తున్నారు. సాధారణంగా వీకెండ్స్ లోనే సినిమాలు విడుదల అవుతుంటాయి. శుక్రవారం నాడు అభిమానులు చూసినా, శని, ఆదివారాల్లో సాధారణ ప్రేక్షకులు పోటెత్తుత్తారని నిర్మాతలు ఫ్రైడే రిలీజ్ లు చేస్తుంటారు. కానీ, మెగాస్టార్ విషయంలో మాత్రం సెలవు రోజులను కాదు, తన సినిమా రిలీజ్ అయిన రోజు సెలవు కావాలి అనే విధంగా మారడం విశేషం.

ADVERTISEMENT

అవును… మెగాస్టార్ పై ఉన్న అభిమానాన్ని ప్రదర్శించుకోవడానికి పలు ప్రైవేటు సంస్థలు ఇప్పటికే జనవరి 11వ తేదీన సెలవు దినంగా ప్రకటించారు. ఒమన్ దేశంలో మస్కట్ లో ఉన్న ‘ఆర్సీటీ’ కన్స్ట్రక్షన్ కంపెనీ మెగా సినిమా విడుదలను పురస్కరించుకుని 11వ తేదీన సెలవు దినంగా ప్రకటిస్తూ ఓ లెటర్ హెడ్ ను విడుదల చేసింది. ఇది కాస్త సోషల్ మీడియాకు ఎక్కడంతో మెగా ఫ్యాన్స్ తన అభిమాన హీరో స్టామినాను చూపిస్తూ, ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ షేర్ చేసుకుంటున్నారు.

అయితే గతంలో ‘కబాలి’ సినిమా విడుదల సమయంలో కూడా ఇదే హంగామాను సృష్టించగా, భారీ అంచనాలతో విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని పొందిందో తెలిసిందే. దీంతో భారీ అంచనాలు ఎలాంటి ఫలితానికి దారి తీస్తుందో అన్న ఆందోళన కూడా ట్రేడ్ వర్గాల్లో నెలకొంది. సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాలలో మొదటగా విడుదల కాబోతున్న “ఖైదీ నంబర్ 150” టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తుందని మెగా కాంపౌండ్ భావిస్తోంది.Muscat Construction Company declares Holiday for Khaidi No 150 release

ADVERTISEMENT
Latest Stories