వర్తమానం నుండి ఫ్లాష్ బ్యాక్ కు వెళితే…. “దువ్వాడ జగన్నాధం” సినిమా టీజర్ విడుదలైన రోజు… యూ ట్యూబ్ లో ఆ సినిమా టీజర్ లైక్స్ లతో డిస్ లైక్స్ లు హోరాహోరీగా పోటీపడ్డాయి. చివరికి టాలీవుడ్ చరిత్రలోనే మోస్ట్ డిస్ లైక్డ్ టీజర్ గా రికార్డు సృష్టించిన వైనం తెలిసిందే. అయితే బన్నీ నటించిన ‘డీజే’ టీజర్ కు ఆ రేంజ్ లో ఎలా డిస్ లైక్స్ వచ్చాయనే విషయం తెలియనిది కాదు. కట్ చేసి… వర్తమానంకు వస్తే… “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ తో అల్లు అర్జున్ మరోసారి యూ ట్యూబ్ లో ప్రత్యక్షమయ్యాడు.
ఈ టీజర్ కు సర్వత్రా పాజిటివ్ స్పందన రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రేంజ్ బన్నీ మీదే ఆధారపడి ఉండడంతో, ఈ మూవీతో బన్నీ అసలు రేంజ్ ఏంటనేది సినీ ప్రపంచానికి కూడా తెలిసి వస్తుందని ట్రేడ్ పండితులు కూడా నిరీక్షిస్తున్నారు. ఫస్ట్ ఇంప్రెషన్ తో మంచి మార్కులు కొట్టడంతో పాటు, ఈ టీజర్ కు ‘డీజే’తో పోలిస్తే చాలా తక్కువ డిస్ లైక్స్ రావడంతో పవర్ స్టార్ అభిమానులు లైట్ తీసుకున్నట్లే కనపడుతోంది.
మరో తొమ్మిది రోజుల్లో విడుదల కాబోయే “అజ్ఞాతవాసి” సినిమా విడుదల కోసం పవన్ ఫ్యాన్స్ ఎదురుచూడడమో లేక బన్నీతో రగడకు శుభంకార్డు వేసేసారో లేక ఈ సినిమా టీజర్ బాగా నచ్చేసిందో ఏమో గానీ ఈ పరిణామం “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” చిత్ర యూనిట్ తో పాటు, హీరో అల్లు అర్జున్ కు ఊరటనిచ్చిందనే చెప్పొచ్చు. ప్రస్తుత ఈక్వేషన్ 65 వేల లైక్స్ ఉండగా, డిస్ లైక్స్ సంఖ్య 13 వేల రేంజ్ లో ఉంది.



