అమరావతి రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వంలో 30 వేల ఎకరాల భూసమీకరణ చేపడితే బాబు అన్ని ఎకరాల భూసమీకరణతో రియలెస్టేట్ చేస్తారా అంటూ వెటకారంగా విమర్శించిన వైసీపీ నాయకులు ఇప్పుడు నెల్లూరులో వైసీపీ చేస్తున్న భూదందా గురుంచి ఏం సమాధానం చెపుతారు అంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు.
గతంలో ఏ ప్రభుత్వ చేయనన్ని స్కాములు ఈ నాలుగున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం చేసింది అంటూ ఆధారాలతో బయటపెడుతున్నారు నాదెండ్ల. ఇండోసోల్ అనే ప్రైవేట్ సంస్థకు రామాయపట్నం వద్ద సుమారుగా 5148 వేల ఎకరాల భూమి 10 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వ కాబినెట్ ఆమోదించిన ‘న్యూ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ’ ద్వారా ఇండోసోల్ యాజమాన్యం ఈ భూమి పై లెస్సి స్థాయి నుండి ఓనర్ స్థాయికి అధికారాలు దక్కించుకున్నారు.
అయితే ఈ ఇండోసోల్ కంపెనీ స్థాపించి నేటికి సుమారుగా రెండేళ్లు పూర్తి చేసుకుంది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వారు స్థాపించిన సంస్థే ఈ ఇండోసోల్. అయితే ఈ సంస్థ ముఖ్యమంత్రి జగన్ సన్నిహితులదే కావడం పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రభుత్వం నుండి ఇంత పెద్ద మొత్తంలో భూమి తీసుకున్న ఈ సంస్థ స్థానిక ప్రజలకు 11 ,500 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం 6 వేల ఉద్యోగాలు మాత్రమే అంటూ మాట మార్చడం కంపెనీలో ఉన్న డొల్లతనాన్ని తెలియచేస్తుంది.
అయినా మారు మాట ప్రశ్నించని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికి ఇచ్చిన 5 వేల ఎకరాలు కాకుండా మరో 3 వేల ఎకరాల భూసేకరణకు కంపెనీకి సహకరిస్తాం అంటూ హామీ ఇవ్వడం వైసీపీ ప్రభుత్వం తాలూకా భూ స్కాములకు సాక్ష్యాలుగా మిగిలాయి. అయితే ఒక అనుభవ రాహిత్యమైన కంపెనీకి మొత్తం 8 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం దారాదత్తం చేయడాన్ని ఏమనాలో?
ఇన్ని ఎకరాల భూసేకరణ చేసి నెల్లూరు జిల్లాలో జగన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏమైనా నాలుగో రాజధానికి ప్లాన్ చేసిందేమో?ఎన్నికల నాటికీ ఏపీ ప్రజలకు సెడాన్ సర్ ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేసిందో నాదెండ్ల గారు అంటూ అంతే వెటకారంగా వైసీపీ కి బదులిస్తున్నారు జనసేన నేతలు.




