“ఖైదీ నంబర్ 150” సినిమా 200 కోట్లు కలెక్ట్ చేస్తుందట!

Naga-Babu-says Khaidi no 150 collects 200 croresసంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 11వ తేదీన విడుదలైన మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ “ఖైదీ నంబర్ 150” బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. చిరు అభిమానులు ఎంతగా ఈ సినిమాను ఆశీర్వదించారంటే… కొన్ని ఏరియాలలో “బాహుబలి” సినిమా కలెక్షన్ల రికార్డులు కూడా పటాపంచలు అయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ తో పాటు మెగా అభిమానులు కూడా ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ హంగామా చేస్తున్నారు. చిరు రీ ఎంట్రీ ఈ రేంజ్ లో ఉంటుందా… అని ట్రేడ్ పండితులు కూడా షాక్ కు గురయ్యే విధంగా వసూళ్లు రావడం విశేషం.

అయితే తొలిరోజు వసూళ్లు మినహా ఈ సినిమా కలెక్షన్స్ పై అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు. తొలిరోజు కలెక్షన్స్ వివరాలు కూడా మెగా కాంపౌండ్ అల్లు అరవింద్ చెప్పారు తప్ప, నిర్మాత రామ్ చరణ్ నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ పై మెగా బ్రదర్ నాగబాబు పెదవి విప్పారు. తన అంచనాల ప్రకారం ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ 150 కోట్లకు చేరుకున్నాయని, ఫుల్ రన్ లో 175 నుండి 200 కోట్ల వరకు వసూళ్లు చేయవచ్చని అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT

ఇక, షేర్ విషయానికి వస్తే ఫుల్ రన్ లో దాదాపుగా 120 కోట్లు క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నానని, తనకు తాజాగా అందిన సమాచారం మేరకు ఇప్పటికీ 95 కోట్లు అధిగమించిందని, ఇది తెలుగు సినిమాకు దక్కిన ఘనవిజయమని, మనమంతా గర్వపడాలని అభిప్రాయపడ్డారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇంత మంచి సక్సెస్ రావడం శుభపరిణామమని, ఒక తెలుగు సినిమాకు ఇది చాలా పెద్ద విజయమని “ఖైదీ నంబర్ 150” కలెక్షన్స్ గురించి చెప్పుకొచ్చారు.

అయితే నిర్మాత చెర్రీ సైడ్ నుండి కాకుండా మెగా కాంపౌండ్ నుండి ఈ కలెక్షన్స్ లీక్ లు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో మెగా అభిమానులకు అర్ధం కాని పరిస్థితి. ఇదే సమాచారం అధికారికంగా వెల్లడిస్తే… బహుశా ఐటీ రైడ్స్ జరుగుతాయని భావిస్తున్నారో ఏమో గానీ, ఒకసారి అల్లు అరవింద్, ఇప్పుడు నాగబాబు ‘బాస్’ రేంజ్ గురించి ప్రస్తావించారు. గతంలో ‘బాహుబలి’ సాధించిన విజయానికి, ఇటీవల ఐటీ శాఖ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. బహుశా దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారికంగా వెల్లడించడం లేదేమో అన్న టాక్ హల్చల్ చేస్తోంది. అయితే ‘బాహుబలి’ కలెక్షన్స్ ను చిత్రయూనిట్ ఎన్నడూ అధికారికంగా వెల్లడించలేదు కదా!

ADVERTISEMENT
Latest Stories