ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న లవ్ స్టోరీ అనే చిత్రం లో యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్నాడు. కరోనా సంక్షోభం కారణంగా ఈ చిత్రం విడుదల తేదీ లో క్లారిటీ లేకుండా పోయింది. మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ నాగ చైతన్యతో తన తదుపరి చిత్రం చెయ్యనున్నారు. మొన్న ఆ మధ్య స్క్రిప్ట్ పని దాదాపుగా పూర్తయింది చెప్పాడు ఆ దర్శకుడు.
స్క్రిప్ట్ లో మంచి వినోదం, రొమాన్స్ మరియు యాక్షన్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే… ఈ చిత్రానికి స్క్రిప్ట్ బీవీఎస్ రవి ఇచ్చారట. స్టోరీ రైటరైనా రవి మొన్న ఆ మధ్య వాంటెడ్, జవాన్ అనే సినిమాలలో డైరెక్షన్ ట్రై చేసి చేతులు కాల్చుకున్నాడు. విక్రమ్ సినిమాలు ప్లాపైనా విభిన్నమైన కథలతో ఆకట్టుకుంటాయి.
దానితో ఈ వార్త అక్కినేని అభిమానులకు మింగుడుపడటం లేదు. ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘థాంక్స్’ అని పేరు పెట్టారని నివేదికలు ఉన్నాయి. సీనియర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు . ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ ప్రారంభించాలనేది ప్రణాళిక. ఈ చిత్రం యొక్క అధికారిక ప్రకటన అతి త్వరలో జరుగుతుంది.
విక్రమ్ మరియు నాగ చైతన్య మనమ్ వంటి క్లాసిక్ అందించినందున ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. మనం తరువాత విక్రమ్ సరైన హిట్ అందుకోలేదు. దానితో ఈ సినిమా విజయం సాధించాలని ఆయన పై ఒత్తిడి ఉంటుంది. విక్రమ్ మొన్న ఆ మధ్య అఖిల్ తో హలో అనే సినిమా తీశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తమ్ముడితో నిరాశపరచిన ఈ దర్శకుడు అన్నతో నైనా హిట్ కొడతాడేమో చూడాలి.
Confused & Not Sure What to Watch on Amazon Prime, Netflix? Click Here





