‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ పై కింగ్ నాగార్జున ‘కళ్యాణం’ పేరుతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్ గా ‘కుందనపు బొమ్మ’ సమంతని ఎంపిక చేసారు. అయితే తాజాగా అక్కినేని కుటుంబంలో జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో జెస్సీని కాదని, మరో హాట్ & హిట్ హీరోయిన్ వైపుకు మొగ్గు చూపినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్ ను చైతూకు జోడిగా ఎంపిక చేసినట్లు ట్రేడ్ వర్గాల టాక్. త్వరలోనే అక్కినేని వారింట సమంత ‘స్వయంపాకం’ వండి పెట్టడానికి సిద్ధమవుతుందన్న వార్తల నేపధ్యంలో… ఈ సినిమా నుండి సమంత పక్కకు జరగడం, రకుల్ ని ఎంపిక చేయడం… శ్యామ్ – చైతూల రిలేషన్ షిప్ కు మరింత బలాన్నిస్తోంది. అయితే జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో ‘కళ్యాణం’ సినిమాలో ఈ హీరోయిన్ మార్పు మంచిదే అంటున్నారు అక్కినేని అభిమానులు.



