టాలీవుడ్ ‘హాట్ పెయిర్’ బ్యాక్ ఎగైన్!

Naga Chaitanya -Samantaha Ruth Prabhu Movie Annoucement‘ఏ మాయ చేసావే’ సినిమాతో ప్రారంభమైన నాగచైతన్య – సమంత రీల్ లైఫ్, గతేడాది రియల్ లైఫ్ తో పెనవేసుకుపోయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ హాట్ పెయిర్ గా గుర్తింపు పొందిన ఈ జంట, మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు కనపడుతుందా? అని వేచిచూసిన అభిమానులకు తీపి కబురు అందింది. ‘నిన్ను కోరి’ సినిమాలో నాని – నివేదాలను విడదీసిన దర్శకుడు శివ నిర్వాణ, ఈ సినిమాతో చైతూ – శ్యామ్ లను ఒక్కటి చేస్తున్నాడు.

ADVERTISEMENT

ఈ దిశగా చైతూ నుండి ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన వెలువడింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేసిన ఈ ప్రకటనతో ఫ్యాన్స్ మళ్ళీ ‘కార్తీక్ – జెస్సీ’లను ఊహించుకుంటున్నారు. షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమా ద్వారా మళ్ళీ సమంతతో మరో లవ్ జర్నీ స్టార్ట్ కాబోతోందని చెప్పిన చైతూ మాటల్లో, ఈ సినిమాకు ఇస్తోన్న ప్రాధాన్యత తెలుస్తోంది. ‘నిన్ను కోరి’లో మెచ్యూర్డ్ లవ్ స్టోరీతో ఆకట్టుకున్న శివ దర్శకుడు కావడంతో ప్రేక్షకుల్లోనూ ఓ స్థాయి అంచనాలు ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories