ఈ ‘బాబు’లో ఈ ‘యాంగిల్’ కూడా ఉందా?

Naga Chaitanya - Samantha Wedding - Suresh Babuదగ్గుపాటి సురేష్ బాబు… అంటే హుందాతనం, పెద్దరికానికి నిదర్శనం. తెలుగు ప్రేక్షకులకు తెలిసినంతవరకు ఇంతే. ఒక్క సినిమా వేడుకలపైనే కాదు, ఇండస్ట్రీ నిర్వహించే క్రికెట్ వంటి అనేక ఈవెంట్స్ లో కూడా సురేష్ బాబు తీరు అలాగే ఉంటుంది. కానీ ప్రతి మనిషిలోనూ రెండో వాడు ఉంటాడు, సమయం వచ్చినపుడు వాడు బయటకు వస్తాడు అని చెప్పే విధంగా నాగచైతన్య – సమంత వివాహ వేడుకలో సురేష్ బాబు చేసిన హంగామా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ADVERTISEMENT

నిజానికి సురేష్ బాబులో ఇలాంటి యాంగిల్ కూడా ఒకటుందని బహుశా ఇప్పటివరకు కుటుంబ సభ్యులకు కూడా తెలుసో లేదో గానీ సినీ ప్రేక్షకులకు మాత్రం ఈ పిక్ ఓ షాకింగ్ లాంటిదే. సాధారణంగా ఇలాంటి వేడుకలలో విక్టరీ వెంకటేష్ చేసే సందడికి కొదవుండదు. కానీ ఈ సారి దగ్గుపాటి సోదరుడు వంతు వచ్చినట్లుంది. మొత్తానికి చైతూ – శ్యాంల వెడ్డింగ్ ఓ అరుదైన ఫోటోకు ఆస్కారాన్ని కల్పించిందన్న మాట. హీరో రేంజ్ లో టవల్ పట్టుకుని మాస్ స్టెప్పులు వేస్తున్న సురేష్ బాబు ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి..!

ADVERTISEMENT
Latest Stories