నాచురల్ స్టార్ స్పూర్తితో అక్కినేని వారసుడు!

Naga Chaitanya taking ani routeఒక్కో మెట్టూ ఎక్కుతూ నాని స్టార్ స్టేటస్ కి చాలా దగ్గరగా వెళ్లిపోయాడు. ఏడాదికి మూడు సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటూ .. కొత్త రచయితలను .. దర్శకులను ప్రోత్సహిస్తూ ముందుకు వెళుతున్నాడు. బడ్జెట్ పరిథిని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తుండటం వలన సక్సెస్ అయితే భారీ లాభాలు వస్తున్నాయి. కాకపోతే నష్టాల శాతం చాలా తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆయనతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు.

ADVERTISEMENT

ఇక నాగచైతన్య కూడా అదే రూట్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ప్లానింగ్ ను బట్టి తెలుస్తోంది. ఈ ఏడాది వరుసగా మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చైతూ సిద్ధమవుతున్నాడు. ఇక బడ్జెట్ లిమిట్ చూసుకుంటూ .. కొత్త దర్శకులకు కూడా ఛాన్స్ ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇలా నానిని ఫాలో అవుతూ .. సక్సెస్ ఫుల్ గా కెరియర్ ను కొనసాగించాలనే ఉద్దేశంతో చైతూ గట్టి కసరత్తే చేస్తున్నాడట.

ADVERTISEMENT
Latest Stories