నిహారికతో పెళ్లి… నిజం చెప్పాడు..!

Naga Sourya Clarifies About Marriage With Niharika Konidelaగత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వ్యాప్తంగా యువహీరో నాగశౌర్య మరియు మెగా డాటర్ నిహారికల వివాహం జరగబోతోందన్న పుకార్లు షికారు చేసిన వైనం తెలిసిందే. నాగశౌర్య ‘ఛలో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి హాజరు కావడం, ఈ పుకార్లకు బ్యాక్ బోన్ లా నిలిచింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగశౌర్యకు మీడియా వర్గాల నుండి సహజంగానే ఈ ప్రశ్న ఎదురుకావడంతో, అసలు నిజాన్ని చెప్పారు.

ADVERTISEMENT

సదరు పుకార్లను ఖండిస్తూ…. నిహారికతో పెళ్లి వార్తలను ఖండించారు. ప్రస్తుతం తన దృష్టి సినిమాల మీదేనని, మరో మూడు, నాలుగేళ్ళ వరకు పెళ్లి చేసుకోబోనని చెప్పిన నాగశౌర్య, తాను చేసుకోబోయే అమ్మాయి తన ఇంట్లో వాళ్ళు చూస్తారని చెప్పుకొచ్చాడు. దీంతో మెగా పుకార్లకు బ్రేక్ పడినట్లయ్యింది. మొత్తానికి నిహారిక కేంద్రంగా ఎప్పుడూ ఏదొక వివాహ వార్త పుకారుగా రావడం గమనించదగ్గ అంశం.

ADVERTISEMENT
Latest Stories