తెలుగు సినీ తెరకు ‘అమ్మోరు’ ద్వారా గ్రాఫిక్స్ ను ఓ రేంజ్ లో పరిచయం చేసిన ఘనత కోడి రామకృష్ణది. అయితే అప్పటినుండి అదే స్థాయి గ్రాఫిక్స్ ను ప్రదర్శించడం అనేది ప్రేక్షకులకు సహనపరీక్షే కదా! మధ్యలో ‘అరుంధతి’ సినిమాతో సత్తా చాటినప్పటికీ, ఆ సినిమా క్రెడిట్ కోడి కంటే కూడా మరొకరికి చెందినది అన్న విషయం తెలిసిందే. తాజాగా ‘నాగభరణం’ పేరుతో మరో విజువల్ వండర్ కు కోడి రామకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ సినిమా ట్రైలర్ స్పష్టం చేసింది.
విష్ణువర్ధన్, రమ్య ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ చెప్పుకోదగినవి. అవి కూడా ప్రస్తుత రేంజ్ లో లేకపోయినప్పటికీ, ఎంతో కొంత ట్రైలర్ లో ఆకట్టుకునే అంశాలు అవే. పూర్తిగా కన్నడ నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లోకి అనువదిస్తున్నారు. తెలుగులో ‘నాగభరణం’ కాగా, తమిళంలో ‘శివనాగం’ టైటిల్ తో విడుదల కానుంది. అక్టోబర్ లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాతో కోడి మరోసారి తన సత్తా చాటుతారేమో చూడాలి.



