ప్రేమమ్’ సినిమాకు ఊహించని ‘క్రేజ్’

premam-trailer-youtube-viewsఓ రీమేక్ సినిమాగా ట్రేడ్ వర్గాల్లో ‘లో బజ్’ తో విడుదలకు సిద్ధమవుతున్న నాగచైతన్య ‘ప్రేమమ్’ సినిమా ఆడియో వైభవంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ కు మాత్రం నెటిజన్ల నుండి ఊహించని స్పందన రావడం విశేషం. ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటల లోపే హాఫ్ మిలియన్ సంఖ్యకు చేరుకోవడం చైతూ సినిమాలకు మొదటిసారిగా జరిగింది.

సాధారణంగా యూ ట్యూబ్ లో అగ్ర హీరోల సినిమాలకే క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. అభిమానులు ఒకటికి, రెండు సార్లు సదరు ట్రైలర్ లను వీక్షిస్తారు గనుక, సహజంగానే యూ ట్యూబ్ క్లిక్స్ రికార్డ్ స్థాయిలో ఉంటాయి. కానీ, చైతూ ‘ప్రేమమ్’కు కూడా అదే రేంజ్ క్లిక్స్ అందుకోవడమంటే… ఈ సినిమాపై నెటిజన్లు క్రేజ్ ఏర్పరచుకున్నారనే అర్ధం. మరి ఆ అంచనాలను ‘చైతూ అండ్ టీం’ అందుకోగలిగితే, సూపర్ సక్సెస్ ను తమ ఖాతాలో వేసుకున్నట్లే..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories