‘పెగ్’ వేస్తూ కెమెరాకు ఫోజిచ్చిన టాలీవుడ్ టాప్ ‘హీరోలు’

Nagarjuna Akkineni Party with Naga Chaitanya Akhilటాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున ఇటీవల కాలంలో తన కుమారులు నాగచైతన్య, అఖిల్ లతో టైమ్ బాగా సస్పెండ్ చేస్తున్నారు. ‘నా కుమారులతో కలసి గొప్ప సాయంత్రాన్ని ఎంజాయ్ చేశా’ అంటూ తాజాగా ఓ ఫొటోను నాగార్జున తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అఖిల్, శ్రియా భూపాల్ ల నిశ్చితార్థం ఈ నెల 9న జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శనివారం నాడు చలన చిత్ర ప్రముఖులకు నాగార్జున గ్రాండ్ పార్టీ ఇచ్చారు.

ADVERTISEMENT

ఈ పార్టీలో సందర్భంగా ఈ అక్కినేని హీరోలు ముగ్గురూ దిగిన ఫోటో అభిమానులను అలరిస్తోంది. ఒక తండ్రి మాదిరి కాకుండా, ఏదో స్నేహితుడో లేక చైతూ, అఖిల్ ల బ్రదర్ మాదిరో కలిసిపోయి చక్కగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనపడుతోంది. టాలీవుడ్ లోనే కాదు, బయట కూడా ఇంత బాగా ఎంజాయ్ చేయగలిగే తండ్రి కొడుకులను చాలా అరుదుగా చూస్తుంటాము. ఈ సందర్భంగా… దటీజ్ అక్కినేని… అంటున్నారు అభిమానులు..! కాదనలేం మరి..!

ADVERTISEMENT
Latest Stories